ETV Bharat / sitara

సంజయ్​దత్ నటిస్తున్న ఆ సినిమాల పరిస్థితేంటి?​ - తూర్భాజ్​

క్యాన్సర్​ చికిత్స కోసం త్వరలో విదేశాలకు వెళ్లనున్నారు ప్రముఖ నటుడు సంజయ్ దత్. ఈ నేపథ్యంలో ఆయన చేస్తున్న సినిమాల పరిస్థితి ఏంటనేది ఇప్పుడొస్తున్న ప్రశ్న. వాటిలో కొన్ని చివరి దశకు చేరుకోగా, మరికొన్ని మధ్యలో ఉన్నాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏంటంటే?

Take a look at Sanjay Dutt's upcoming films and their status
సంజయ్​దత్​ చేతిలో ఎన్ని సినిమాలున్నాయో తెలుసా!
author img

By

Published : Aug 19, 2020, 4:31 PM IST

బాలీవుడ్​ నటుడు సంజయ్​దత్​కు ఊపిరితిత్తుల క్యాన్సర్​ ఉన్నట్లు ఇటీవలే బయటపడింది. చికిత్స తీసుకునేందుకు సినిమాలకు తాత్కాలిక విరామం ప్రకటించారు. ప్రస్తుతం ఈయన ఆరు సినిమాల్లో నటిస్తున్నారు. వీటిలో కొన్ని డబ్బింగ్​ వరకు రాగా, మరికొన్ని షూటింగ్​ దశలో ఉన్నాయి. లాక్​డౌన్​ కారణంగా వాటి చిత్రీకరణ​ మరింత ఆలస్యం కానుంది. దీంతోపాటే సంజయ్ కొన్నిరోజుల విరామం తీసుకోనుండటం వల్ల వాటిని పూర్తి చేసేందుకు మరిన్ని రోజులు సమయం పట్టనుంది.

1) సడక్​ 2

'సడక్​ 2' టీజర్​ ఇటీవలే విడుదలైంది. యూట్యూబ్​లో అత్యధిక డిస్​లైక్స్​ పొందిన మూడో వీడియోగా చెత్త రికార్డు మూటగట్టుకుంది. అయితే ఈ సినిమా కోసం సంజయ్​దత్​ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో దర్శకుడు మహేశ్​భట్​ కుమార్తెలు పూజా, ఆలియా భట్​లతో పాటు ఆదిత్య రాయ్​ కపూర్​ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి కొంత డబ్బింగ్​ మినహా షూటింగ్​ మొత్తం పూర్తయింది. క్యాన్సర్​ చికిత్సకు​ వెళ్లే ముందే దీని డబ్బింగ్​ పూర్తి చేయాలని సంజయ్​ భావిస్తున్నారు. ఇది ఆగస్టు 28న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.

2) షంషేరా

ఈ సినిమాలో సంజయ్​కు సంబంధించిన సన్నివేశాలు ఇంకా చిత్రీకరించలేదు. ఆయన​ ఆరోగ్యం మెరుగైన తర్వాతే తిరిగి షూటింగ్ మొదలుపెట్టాలని చిత్రబృందం అనుకుంటోంది. కరణ్​ మల్హోత్రా దర్శకుడు. యశ్​రాజ్​ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. రణ్​బీర్​ కపూర్​, వాణీ కపూర్​లు హీరోహీరోయిన్లు.

3) భుజ్​: ది ప్రైడ్​ ఆఫ్​ ఇండియా

పీరియాడికల్ డ్రామా అయిన ఈ సినిమాలో అజయ్​ దేవగణ్​తో సంజయ్ నటిస్తున్నారు. 1971లో భారత్​-పాక్​ యుద్ధంలో పాల్గొన్న భారత వైమానికి దళ పైలట్​ విజయ్​ కార్నక్​, గుజరాత్​ కచ్​ జిల్లాలోని మాధపార్​ గ్రామానికి చెందిన 300 మంది మహిళల కథను ఇందులో చూపించనున్నారు.

ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు మినహా మిగిలిన చిత్రీకరణ అంతా పూర్తయిందని తెలుస్తోంది. వాటిని త్వరలోనే పూర్తి చేయనున్నారని సమాచారం. అభిషేక్​ దుదియా దర్శకత్వం వహిస్తుండగా సోనాక్షి సిన్హా, నోరా ఫతేహి, శరద్ కేల్కర్​ ప్రధానపాత్రలు పోషిస్తున్నారు.

4) కేజీఎఫ్​ 2

కన్నడ స్టార్​ హీరో యశ్​ నటిస్తున్న చిత్రం 'కేజీఎఫ్ 2​'. షూటింగ్ చివరి దశలో​ ఉంది. ఇందులో ప్రతినాయకుడి అధీరాగా కనిపించనున్నారు సంజయ్​ దత్​. ఈ ఏడాది అక్టోబరు 23న రావాల్సింది కానీ లాక్​డౌన్​ కారణంగా అది కాస్త వాయిదా పడింది.

సంజయ్​పై తీయాల్సిన కొన్ని సన్నివేశాలు, డబ్బింగ్​ మినహా షూటింగ్ అంతా​ పూర్తయినట్లు తెలుస్తోంది. శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్​, అనంత్​ నాగ్​లు కీలకపాత్రలు పోషిస్తుండగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు.

5) పృథ్వీరాజ్​

యశ్​రాజ్​ ఫిలింస్ ప్రతిష్ఠాత్మకంగా తీస్తున్న 'పృథ్వీరాజ్​'లో అక్షయ్​ కుమార్ కథానాయకుడు.​ సంయోగిత పాత్రలో మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ నటిస్తోంది. కీలక పాత్రలో సంజయ్​దత్ కనిపించనున్నారు.

6) తూర్భాజ్​

'తూర్భాజ్'​ సినిమాలో సంజయ్​ దత్​ ఆర్మీ అధికారిగా కనిపించనున్నారు. త్వరలో ఓటీటీ వేదికగా ప్రేక్షకులను పలకరించనుంది. గిరీశ్​ మాలిక్​ దర్శకుడు. నర్గీస్​ ఫక్రీ, రాహుల్​ దేవ్​ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.