సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి ప్రధానపాత్రల్లో హాకీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఏ1 ఎక్స్‌ప్రెస్'. జీవన్ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటాద్రి సినిమాస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఈ చిత్రం మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సెన్సార్ ముందుకు వెళ్లిన ఈ సినిమా క్లీన్ 'యు' సర్టిఫికేట్ సంపాదించింది.
'ఆర్ఎక్స్ 100' బాలీవుడ్ రీమేక్‌గా తెరకెక్కుతోంది 'తడప్'. ఈ చిత్రంలో సునీల్ శెట్టి తనయుడు అహన్ శెట్టి హీరోగా నటిస్తుండగా తారా సుతారియా హీరోయిన్గా చేస్తోంది. మిలన్ లుథ్రియా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను తాజాగా ప్రకటించింది చిత్రబృందం. సాజిద్ నదియావాలా నిర్మిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించింది.