ETV Bharat / sitara

'దీపికా, కంగనాలతో పోటీపడతా అనుకోలేదు' - దీపికా పదుకొణె న్యూస్​

బాలీవుడ్​ నటి తాప్సీ నటించిన 'తప్పడ్' చిత్రం ఈ ఏడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొట్టింది. ఈ సినిమా 'ఛపాక్​', 'పంగా'లతో పోటీ పడటం తాను నమ్మలేని విషయమని ఆమె తెలిపింది.

Taapsee stunned as Thappad surpasses Panga, Chappak at BO
'దీపికా, కంగనా సినిమాలతో పోటీ పడతాననుకోలేదు'
author img

By

Published : Apr 8, 2020, 4:20 PM IST

బాలీవుడ్​లో ఈ ఏడాది విడుదలైన లేడి ఓరియెంటెడ్​ మూవీస్​ 'ఛపాక్​', 'పంగా'. దీపికా పదుకొణె, కంగనా రనౌత్ నటించిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చాయి. కానీ తాప్సీ నటించిన 'తప్పడ్' మూవీ మంచి కలెక్షన్లు సాధించింది. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించింది తాప్సీ.

"ఈ ఏడాది విడుదలైన లేడి ఓరియెంటెడ్​ చిత్రాలు 'ఛపాక్'​, 'పంగా'లతో 'తప్పడ్' సినిమాను పోల్చటం సరికాదు. వాటి కలెక్షన్లతో పోల్చుకోవటం కానీ, అధిగమిస్తామని కానీ ఎప్పుడూ అనుకోలేదు. నా ప్రతి చిత్రం తర్వాత అగ్రకథానాయికను అయ్యానని అందరూ అంటుంటే భయమేసేది. ఒకసారి ఆ స్థానానికి చేరిన తర్వాత మళ్లీ కిందికి రాలేము. అందుకే వారి ప్రశంసలు ఎలా ఉన్నా.. వాటిని తలపైకి ఎక్కించుకోను."

- తాప్సీ, కథానాయిక

'తప్పడ్​' సినిమాలోని తాప్సీ పోషించిన 'అమృత' పాత్ర ప్రతి వ్యక్తికి దగ్గరయ్యింది. దర్శకుడు అనుభవ్ ​సిన్హా చెప్పిన విధంగా చేశానని ఆమె చెప్పింది. ఈ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలే కాకుండా.. ప్రతి సినీ విమర్శకుడి ప్రశంసలూ అందుకుంది.

Taapsee stunned as Thappad surpasses Panga, Chappak at BO
తాప్సీ

తాప్సీ.. లాక్​డౌన్ సమయంలో వంటగదిలో ఎక్కువ సమయం గడుపుతోంది. ప్రస్తుతం 'హసీనా దిల్​రూబా' చిత్రంలో విక్రాంత్​ మాసేతో కలిసి నటిస్తోంది.

ఇదీ చూడండి.. 23 వేల మందికి ఆర్థిక సాయం చేసిన సల్మాన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.