ETV Bharat / sitara

తాప్సీ ముచ్చటగా మూడు.. మ్యూజిక్​ వీడియోలో ఊర్వశీ - urvashi

కొవిడ్ లాక్​డౌన్​ అనంతరం వరుస చిత్రాలతో జోరుచూపిస్తోంది సొట్ట బుగ్గల సుందరి తాప్సీ. మూడో చిత్రాల షూటింగ్​ ముగించుకొని మరో చిత్రానికి సన్నద్ధమవుతోంది. ఇక హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా ఓ మ్యూజిక్ వీడియోలో అలరించనుంది.

Taapsee: Ran behind films, some have thankfully fallen in my lap
తాప్సీ ముచ్చటగా మూడు.. ఆ వీడియోలో ఊర్వశీ
author img

By

Published : Feb 14, 2021, 8:28 PM IST

లాక్​డౌన్ తర్వాత వరుస చిత్రాలతో దూసుకుపోతోంది నటి తాప్సీ పన్ను. ఇప్పటికే మూడు చిత్రాల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ మరో సినిమాకు సిద్ధమైంది. ఇటీవల 'లూప్ లపేటా' చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా ఆ చిత్రానికి సంబంధించిన విశేషాలు పంచుకుంది తాప్సీ.

"నేను కొన్ని సినిమాల వెంట పడ్డాను. కొన్ని నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. ఈ చిత్రం విషయంలో రెండోదే జరిగింది. అందుకు 'లూప్ లపేటా' చిత్ర బృందానికి నేను రుణపడి ఉంటాను." అని చిత్రీకరణకు సంబంధించిన ఫొటోలను ఇన్​స్టాగ్రామ్​​లో పంచుకుంది తాప్సీ.

'లూప్​ లపేటా'ను1998లో జర్మనీలో వచ్చిన 'రన్ లోలా రన్' ఆధారంగా తీస్తున్నారు. దాని కన్నా ముందే 'హసీన్ దిల్​రుబా', 'రష్మీ రాకెట్' చిత్రీకరణ పూర్తి చేసింది తాప్సీ. ఇక ఇప్పుడు భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న 'శభాష్ మిథు'చిత్రం కోసం శిక్షణ తీసుకోనుంది తాప్సీ.

Taapsee: Ran behind films, some have thankfully fallen in my lap
తాప్సీ నటిస్తున్న చిత్రాలు

నటి ఊర్వశి రౌతేలా ఓ మ్యూజిక్ వీడియోలో నటించనుంది. రాపర్, సంగీత దర్శకుడు గురు రంధావాతో కలిసి 'మర్ జాయేంగే' అనే పాటలో మెరవనుంది. సాహిత్యం బి ప్రాక్, జానీ అందించగా, భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు.

ఊర్వశీ, గురు రంధావా

ఇదీ చూడండి: నా పెళ్లి వార్త నిజమే: మెహరీన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.