ETV Bharat / sitara

Julia's Eyes: దృష్టి లోపమున్న పాత్రలో తాప్సీ - తాప్సీ సినిమాలు

ఇటీవలే విడుదలైన 'హాసీన్​ దిల్​రూబా' సినిమాతో ప్రేక్షకులను అలరించారు బాలీవుడ్​ హీరోయిన్ తాప్సీ. మరోవైపు అనేక చిత్రాలతో బిజీగా ఉన్న తాప్సీ.. ఇప్పుడు మరో స్పానిష్​(Julia's Eyes Remake) సినిమా రీమేక్​లో నటించేందుకు సిద్ధమయ్యారు. అజయ్​ భాల్​ దర్శకత్వంలో రూపొందునున్న చిత్రంలో తాప్సీ దృష్టి లోపమున్న అమ్మాయి పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది.

Taapsee Pannu to star in Julia's Eyes Remake
Julia's Eyes: దృష్టి లోపమున్న పాత్రలో తాప్సీ
author img

By

Published : Jul 5, 2021, 9:45 AM IST

'జూలియాస్​ ఐస్​'(Julia's Eyes).. 2010లో విడుదలైన స్పానిష్​ చిత్రం. హారర్​ థ్రిల్లర్​ జానర్​లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇప్పుడు హిందీలో రీమేక్(Julia's Eyes Remake) చేస్తున్నారు. మాతృకలో దృష్టి లోపమున్న కవల సోదరిగా నటించిన బెలూన్​ రైడా పాత్రలో తాప్సీ కనువిందు చేయనున్నారు.

బాలీవుడ్ నటుడు గులన్ దేవాయ్ ఇందులో మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. సెక్షన్ 375 తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలందుకున్న అజయ్​భాల్​ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మన దేశానికి తగ్గట్లు స్క్రిప్ట్ మార్పులు చేసినట్లు అజయ్ చెప్పుకొచ్చారు. నైనిటాల్లో జులై 20 నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

'హసీన్​ దిల్​రూబా' సందడి..

లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలతో జోరుమీదున్న హీరోయిన్​ తాప్సీ.. ఇటీవలే 'హసీన్​ దిల్​రూబా'(Haseen Dillruba) చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. జులై 2న నెట్​ఫ్లిక్స్​లో విడుదలైన చిత్రానికి పాజిటివ్​ రెస్పాన్స్​ వస్తుంది. రొమాంటిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో తాప్సీకి జోడిగా విక్రాంత్‌ మాస్సే నటించారు. ఇందులో తెలుగు నటుడు హర్షవర్ధన్‌ రాణె కూడా ఓ కీలక పాత్ర పోషించారు. వినీల్‌ మాథ్యూ దర్శకత్వం వహించారు.

ఇదీ చూడండి.. రివ్యూ: 'హసీన్​ దిల్​రుబా' ఎలా ఉందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.