ETV Bharat / sitara

'ఆ పాత్ర నా కెరీర్​లోనే అతిపెద్ద ప్రయోగం' - తాప్సీ పన్ను తాజా వార్తలు

బాలీవుడ్​ బ్యూటీ తాప్సీ పన్ను ఇన్​స్టాలో 'సాంఢ్​ కీ ఆంఖ్'​ చిత్రం కోసం తన తొలి ట్రయల్​ లుక్​ను అభిమానులతో పంచుకుంది. ఈ సినిమాలో తాప్సీ ఎప్పుడూ చూడని విభిన్న పాత్రలో కనిపించి ఆశ్చర్యపరిచింది.

Taapsee Pannu shares pic from Saand Ki Aankh look test
తాప్సీ పన్ను
author img

By

Published : Jul 13, 2020, 9:10 PM IST

ఎలాంటి పాత్రలోనైనా పరకాయప్రవేశం చేసి తన నటనతో ప్రేక్షకులను మైమరిపిస్తుంది బాలీవుడ్​ హీరోయిన్​ తాప్సీ పన్ను. తాజాగా, 'సాంఢ్ కీ ఆంఖ్'​ చిత్రం కోసం పరిశీలించిన తన తొలి ట్రయల్​ లుక్​ను ఇన్​స్టాగ్రామ్​ వేదికగా పంచుకుందీ ముద్దుగుమ్మ. తన సినీ కెరీర్​లో ఇదే అతిపెద్ద ప్రయోగం అని పేర్కొంది. ఇందులో తాప్సీ ఎప్పుడూ చూడని విభిన్న పాత్రలో ఓ వృద్ధురాలిగా కనిపించింది. ఈ క్రమంలోనే తన అనుభవాలను పంచుకుంది.

"నా కెరీర్​లోనే అతిపెద్ద ప్రయోగం ఈ పాత్ర. తొలిసారి డైరెక్టర్​గా తుషార్ హీరా​నందాని​, మొదటిసారి నిర్మాతగా నిధి పార్మర్హిరా, ఇక కెరీర్​లోనే తొలిసారి ఇద్దరు నటీమణులు తమ వయసుకు మించిన పాత్రల్లో నటించేందుకు ఒప్పుకున్నారు. ఇందులో ఎంతో మంది మొదటిసారి సినిమా కోసం పనిచేసిన వ్యక్తులు ఉన్నారు. నాకు తెలిసి ఇది ప్రారంభీకుల అదృష్టం అనుకుంటా. 'సాంఢ్​ కీ ఆంఖ్​'తో నాకు ఎన్నో అనుభవాలు ముడిపడి ఉన్నాయి."

తాప్సీ పన్ను, సినీ నటి

ప్రస్తుతం ఈ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలోనూ తాప్సీ షూటింగ్​ను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో 'రష్మీ రాకెట్'​, 'శభాష్​ మిథు', 'హసీన్​ దిల్​రూబా', 'లూప్​ లాపెటా' వంటి సినిమాలు ఉన్నాయి.

ఇదీ చూడండి:రజనీ, విజయ్​లను అధిగమించిన శివకార్తికేయన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.