ETV Bharat / sitara

తాప్సీతో రొమాంటిక్​ సీన్స్​.. భయపడిన ఆ హీరోలు - విక్రాంత్​ మాస్సే హసీన్​ దిల్​రూబా

రొమాంటిక్​ సన్నివేశాలు చేయడంలో తన సహనటులు భయపడ్డారని తాప్సీ చెప్పింది. తన స్టార్​డమ్​ లేదా మరేదైనా దీనికి కారణమై ఉండొచ్చని తెలిపింది. ఈమె నటించిన 'హసీన్ దిల్​రుబా' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Taapsee Pannu says Vikrant Massey, Harshvardhan Rane were 'scared' to film intimate scenes
'రొమాంటిక్​ సీన్స్​లో నాతో నటించాలంటే భయపడ్డారు'
author img

By

Published : Jun 28, 2021, 3:39 PM IST

తనతో కలిసి రొమాంటిక్ సీన్లు చేసేందుకు విక్రాంత్ మాస్సే, హర్షవర్ధన్ భయపడ్డారని హీరోయిన్ తాప్సీ చెప్పింది. తన కొత్త సినిమా 'హసీన్ దిల్​రుబా' ప్రచారంలో భాగంగా ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. వినీల్​ మ్యాథ్యూ దర్శకత్వం వహించిన ఈ డార్క్​ కామెడీ థ్రిల్లర్​ జులై 2న నెట్​ఫ్లిక్స్​ (Haseen Dillruba on Netflix)​లో విడుదల కానుంది.

"హసీన్ దిల్​రుబా షూటింగ్​లో రొమాంటిక్ సీన్స్ చేసేందుకు సహనటులు విక్రాంత్​ మాస్సే, హర్షవర్ధన్​ రాణేలు చాలా భయపడ్డారు. కానీ, వారిద్దరూ సౌకర్యవంతంగా భావించేలా నేను చేశాను. బహుశా నా స్టార్​డమ్​ లేదా మరేదైనా కారణంతో వాళ్ల భయపడి ఉండొచ్చని అనుకుంటున్నాను"

- తాప్సీ, కథానాయిక

సినిమాలో అలాంటి(బోల్డ్​) సన్నివేశాల్లో నటించాల్సి వస్తే మీ జీవిత భాగస్వామి దగ్గర అనుమతి తీసుకుంటారా? అని అడిగిన ప్రశ్నకు తాప్సీ సమాధానమిచ్చింది. "లేదు, సినిమాల్లో సన్నిహితంగా ఉండే సన్నివేశాల గురించి నా జీవిత భాగస్వామితో చెప్పను. వాటి గురించి పర్మిషన్​ కూడా అడగకూడదనే అనుకుంటాను" అని చెప్పింది.

తాప్సీ.. 'హసీన్​ దిల్​రూబా' సినిమా విడుదలకు సిద్ధమవగా.. 'లూప్​ లపేటా', 'రష్మీ రాకెట్​', 'దుబారా', 'శభాష్​ మిథూ' షూటింగ్​ తుదిదశకు చేరుకున్నాయి.

విక్రాంత్​ మాస్సే.. గతంలో నటించిన 'కార్గో', 'డాలీ కిట్టీ ఔర్​ వో చమక్తే సితారే', 'గిన్నీ వెడ్స్​ సన్నీ' చిత్రాల తర్వాత ప్రస్తుతం 'హసీన్​ దిల్​రూబా' సినిమా కూడా నెట్​ఫ్లిక్స్​ విడుదల కానుంది. హర్షవర్ధన్​ చివరిగా 'తైష్' చిత్రంలో నటించారు.

ఇదీ చూడండి.. స్టార్ హీరో డ్రీమ్ హౌస్​ కోసం రూ.150 కోట్లు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.