Taapsee Pannu Marriage: సినీ నటి తాప్సీ పన్ను.. 'హసీనా దిల్రుబా', 'రష్మీ రాకెట్' చిత్రాలతో ఈ ఏడాదిని విజయవంతంగా పూర్తి చేసుకుంది. అయితే తాప్సీ.. తన ప్రియుడు, మాజీ బ్యాడ్మింటన్ ఆటగాడు మాథియాస్ బోను వచ్చే ఏడాది వివాహం చేసుకోనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయమై తాప్సీ స్పష్టత ఇచ్చింది.
"ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు. నా చేతిలో కొన్ని సినిమాలు ఉన్నాయి. అవి పూర్తయ్యాక ఆలోచిస్తాను. హడావుడిగా పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు నచ్చదు"
-తాప్సీ, నటి.
పెళ్లి విషయంపై పూర్తి క్లారిటీతో ఉన్న తాప్సీ.. ప్రశాంతమైన మూడ్లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. పెళ్లి కాగానే కొత్తగా ఏమీ మార్పు రాదని అభిప్రాయపడుతున్నట్లు తెలిపింది.
ఈ ఏడాదిలో రెండుసార్లు లాక్డౌన్ తరహా ఆంక్షలు విధించడంపై తాప్సీ మాట్లాడింది. లాక్డౌన్ ప్రభావం తనపై తీవ్రంగా ఉన్నట్లు తెలిపింది. కుటుంబంతో గడిపేందుకు సరిగా సమయం లభించలేదని పేర్కొంది. 2022లో అయినా ప్రశాంతత దొరుకుతుందని ఆశిస్తున్నట్లు తెలిపింది.
ఇదీ చదవండి:
నాపై పుస్తకం రాస్తే.. అతడి పేరు ఉండాల్సిందే: తాప్సీ