ETV Bharat / sitara

కరోనాకు భయపడని తాప్సీ.. షూటింగ్​కు హాజరు - సెట్​లో అడుగుపెట్టిన తాప్సీ

బాలీవుడ్​లో షూటింగ్​లు పునఃప్రారంభమయిన తర్వాత.. వెండితెర నటుల్లో తొలిసారిగా సెట్​లో అడుగుపెట్టింది హీరోయిన్​ తాప్సీ. ఈ మేరకు తన మేకప్​ రూమ్​కు​ సంబంధించిన ఓ ఫొటోను ఇన్​స్టా స్టోరీస్​లో పోస్ట్​ చేసింది.

tapsee
తాప్సీ
author img

By

Published : Jul 7, 2020, 8:58 PM IST

కరోనాతో దాదాపు మూడునెలలపాటు నిలిచిపోయిన చిత్రీకరణలు, ప్రభుత్వాలు ఇచ్చిన సడలింపుల్లో భాగంగా పునఃప్రారంభమయ్యాయి. అయినా కరోనా నేపథ్యంలో ప్రముఖ నటులెవరు ఇప్పటివరకు చిత్రీకరణలో పాల్గొనలేదు. ఈ క్రమంలోనే బాలీవుడ్​ వెండితెర నటుల్లో తొలిసారిగా షూటింగ్​ సెట్​లో అడుగుపెట్టింది ప్రముఖ హీరోయిన్​ తాప్సీ . ఈ విషయాన్ని తానే స్వయంగా తెలిపింది.

దీనికి సంబంధించి తన మేకప్​ రూమ్ ఫొటోను ఇన్​స్టా స్టోరీస్​లో పోస్ట్​ చేసింది తాప్సీ. 'బ్యాక్​ టు వర్క్'​ అంటూ వ్యాఖ్య రాసుకొచ్చింది. అయితే ఏ సినిమాకు సంబంధించిన షూటింగ్​ అనేది స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం 'హసీన్​ దిల్​రుబా' సహా పలు చిత్రాల్లో నటిస్తోందీ భామ.

shooting
మేకప్​ రూమ్​

ఇప్పటికే హిందీ బుల్లితెర ధారావాహిక 'నాగిని 4' చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ విషయాన్ని ఇందులో నటిస్తోన్న స్టార్స్​ అనితా హాసన్​ నందిని, నియా శర్మ తెలిపారు. ఆగస్టులో తాను నటిస్తోన్న 'బెల్​బాటమ్'​ సినిమాను సెట్స్​పైకి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు స్టార్​ హీరో అక్షయ్​కుమార్​.

ఇది చూడండి : నటి ఊర్వశికి పెళ్లి.. షాక్​లో అభిమానులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.