హీరోయిన్ తాప్సీ పన్ను, దర్శకుడు అనురాగ్ కశ్యప్ కాంబినేషన్లో మరో చిత్రం తెరకెక్కనుందా? అంటే అవుననే అంటున్నాయి బాలీవడ్ వర్గాలు. తాజాగా వీరిద్దరూ చేసిన ట్వీట్లు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
"ధైర్యం, సృజనాత్మకత, అయోమయాన్ని పారదోలడం.. ఇవన్నీ ఒకే దగ్గర ఉండటం చాలా అరుదు. నేను ఏ క్లూ ఇస్తున్నానో అర్థం అవుతుందా? నేను దేని గురించి ఆలోచిస్తున్నానో ఊహించండి" అంటూ 'వాట్స్ కల్ట్' అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేసింది తాప్సీ.
-
Guess what am I talking about?! #WhatsCult pic.twitter.com/GyUXdFKwNs
— taapsee pannu (@taapsee) February 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Guess what am I talking about?! #WhatsCult pic.twitter.com/GyUXdFKwNs
— taapsee pannu (@taapsee) February 11, 2021Guess what am I talking about?! #WhatsCult pic.twitter.com/GyUXdFKwNs
— taapsee pannu (@taapsee) February 11, 2021
అనంతరం "ఓ ప్రత్యేకమైన దాని కోసం కల్ట్ టీమ్‌తో కలుస్తున్నా. అది ఏమై ఉంటుందో ఊహించండి. ఎదురుచూస్తూ ఉండండి" అంటూ 'వాట్స్ కల్ట్' అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేశాడు అనురాగ్. వీరిద్దరి ట్వీట్లు చూసిన నెటిజన్లు వీరి కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతుందని అభిప్రాయపడుతున్నారు.
-
Confused? Hona bhi chahiye. Accha hain. Wait and watch 😎 #WhatsCult pic.twitter.com/2T4vCGY95c
— Anurag Kashyap (@anuragkashyap72) February 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Confused? Hona bhi chahiye. Accha hain. Wait and watch 😎 #WhatsCult pic.twitter.com/2T4vCGY95c
— Anurag Kashyap (@anuragkashyap72) February 11, 2021Confused? Hona bhi chahiye. Accha hain. Wait and watch 😎 #WhatsCult pic.twitter.com/2T4vCGY95c
— Anurag Kashyap (@anuragkashyap72) February 11, 2021
తాప్సీ, అనురాగ్.. 2018లో విడుదలైన 'మన్మర్జియాన్' చిత్రం కోసం కలిసి పనిచేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనురాగ్‌తో ఓ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ కోసం పనిచేయబోతున్నట్లు వెల్లడించింది తాప్సీ.