మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి. అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దిగ్విజయంగా ప్రదర్శితమవుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. సోమవారం చిత్రబృందం మీడియాతో మాట్లాడింది.
ఈ సందర్భంగా విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానామిచ్చింది చిత్రబృందం. పవన్‌కల్యాణ్‌తో మీ కాంబినేషన్ చూడొచ్చా అని ఈటీవీ విలేకరి అడిగిన ప్రశ్నకు.. కథ అనుకూలిస్తే సాధ్యమవుతుందని బదులిచ్చాడు చిరు.
"నా బిడ్డతో చేయడం ఎంత హ్యాపీ ఉంటుందో, నా తమ్ముడితో నటించడం కూడా అంతే ఆనందాన్ని ఇస్తుంది.ఎవరైనా మంచి కథతో వస్తే కల్యాణ్‌తో కలిసి పనిచేయడానికి నేనూ, చరణ్ రెడీ" - చిరంజీవి
నయనతార, తమన్నా కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో విజయ్‌సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు కీలకపాత్రల్లో కనిపంచారు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ప్రత్యేక పాత్రలో మెప్పించాడు.
ఇదీ చదవండి: 'నా కళ్లలోకి చూడాలంటే గంభీర్‌కు భయం'