బాలీవుడ్లో కార్యకలాపాలు ఎలా సాగుతున్నాయనే విషయంపై నటి సుస్మితా సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవలే విడుదలైన 'ఆర్య' వెబ్‌సిరీస్‌తో విజయం సాధించిన ఈ ముద్దుగుమ్మ.. హీందీ పరిశ్రమ ఈగోలతో నిండిపోయిందని పేర్కొంది. ఏదైనా ఆఫర్‌ను తిరస్కరించినప్పుడు.. అది పెద్ద సమస్యగా మారుతుందని వివరించింది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సుస్మితా తన అభిప్రాయాలను పంచుకుంది.
మనం విపరీతమైన ఈగోలతో నిండిన పరిశ్రమలో ఉన్నాం. ఇదేం పెద్ద రహస్యం కాదు. ఎప్పుడైనా మీరు.. "కాదు, కుదరదు" అని చెబితే అది పెద్ద సమస్య అవుతుంది. మీరే పెద్ద సమస్యగా మారిపోతారు. ఒక్కోసారి పని చేయాలని కూడా అనిపించదు. నేను చేసే పనిలో ఎప్పుడు నిజాయితీగా, బాధ్యతగా ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తా. నా దగ్గరికి వచ్చిన కొన్ని ఆఫర్లు నాకు సరిపోవు. 'నువ్వు ఇండస్ట్రీలో ఉండటానికి మేము సాయం చేస్తున్నాము' అన్నట్టు ఉంటుంది. అలాంటిది నాకు నచ్చదు.
సుస్మితా సేన్, సినీ నటి.
సుశాంత్ మరణం తర్వాత రేకెత్తిన నెపోటిజంపై ఇటీవలే స్పందించిన సుస్మితా.. 'ప్రస్తుతం మీడియా, ఎక్కడ చూసినా బంధుప్రీతి గురించే చర్చ నడుస్తోంది. మనమంతా వాటిని భరిస్తూనే వచ్చాం. ఇదేమీ కొత్త కాదు. మనం ఇప్పుడు గ్రహించిన విషయమా ఇది?' అనితెలిపింది.