ETV Bharat / sitara

'మిత్రమా.. మరో ప్రపంచంలో మళ్లీ కలుద్దాం' - latest sushanth singh death news

బాలీవుడ్​ కథానాయకుడు సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​పై అతని స్నేహితుడు, నటుడు సిద్ధార్థ్​ గుప్తా సంతాపం తెలిపారు. ఈ క్రమంలోనే సుశాంత్​తో తనకున్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ.. అవకాశాలున్న ప్రపంచంలో మళ్లీ కలుద్దాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.​

sushanth singh rajput friend siddharth tribute to his friend
'మిత్రమా.. అవకాశాలు మెరిసే ప్రపంచంలో మళ్లీ కలుద్దాం'
author img

By

Published : Jun 18, 2020, 9:08 AM IST

బాలీవుడ్‌ యువ కథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ బలవన్మరణం ప్రతి ఒక్కరినీ తీవ్రంగా కలచివేస్తోంది. సినీ తారలు, స్నేహితులు, అభిమానులు సోషల్‌మీడియా ద్వారా సుశాంత్‌ మృతికి సంతాపం తెలుపుతున్నారు. తాజాగా ఆయన స్నేహితుడు, నటుడు సిద్ధార్థ్‌ గుప్తా సుశాంత్‌తో తనకున్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. తనతో కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు పంచుకుంటూ సోషల్‌మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశారు.

"నా బాధను వర్ణించలేను. నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు. సోదరా.. అంతులేని అవకాశాలతో నక్షత్రాలు మెరిసే వేరే ప్రపంచంలో నిన్ను మళ్లీ కలుస్తా" అంటూ తన ఆవేదన పంచుకున్నారు. ఈ వీడియోల్లో సుశాంత్‌ తన స్నేహితులతో చాలా సంతోషంగా కనిపించారు.

సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆదివారం ముంబయిలోని తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. సుశాంత్‌ గత కొన్ని నెలలుగా డిప్రెషన్‌తో సతమతమవుతున్నారని పోలీసు విచారణలో తెలిసింది. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పూనుకున్నాడని సమాచారం.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.