ETV Bharat / sitara

సుశాంత్ చివరి చిత్రం ఎలా ఉండబోతుంది! - latest sushant singh news

బాలీవుడ్​ దివంగత హీరో సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ ఆఖరి సినిమా 'దిల్​ బెచారా' విడుదలకు సమయం ఆసన్నమైంది. శుక్రవారం రాత్రి 7.30 నిమిషాలకు డిజిటల్ ప్లాట్​ఫామ్​ డిస్నీ ప్లస్ హాట్​స్టార్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

sushanth sing dil bechara release
సుశాంత్
author img

By

Published : Jul 24, 2020, 4:42 PM IST

బాలీవుడ్​ హీరో సుశాంత్​ సింగ్ రాజ్​పుత్​ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. అతను ఆఖరుగా నటించిన 'దిల్​ బెచారా' సినిమా ఈ రోజే(శుక్రవారం) విడుదల కానుంది. రాత్రి 7.30 నిమిషాలకు ఓటీటీ ప్లాట్​​ఫామ్​ (డిస్నీ ప్లస్​, హాట్​స్టార్​) ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ యాప్​ ఉన్న ప్రతి ఒక్కరూ ఉచితంగా వీక్షించొచ్చు.

ఇటీవలే విడుదలైన ట్రైలర్.. పలు రికార్డుల్ని సృష్టించింది. 24 గంటల్లోనే(దాదాపు 4.2 మిలియన్) ప్రపంచంలోనే అత్యధిక లైకులు దక్కించుకున్న తొలి సినిమా ప్రచార చిత్రంగా అరుదైన ఘనత సాధించింది. ఇంతకు ముందు హాలీవుడ్​లో అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్, అవెంజర్స్: ఎండ్​గేమ్ పేరిట ఈ లైకుల రికార్డు ఉండేది. కానీ సుశాంత్ చివరి సినిమా వాటిన్నింటిని అధిగమించింది. మరి డిజిటల్​ మాధ్యమాల్లో 'దిల్ బెచారా' సినిమా ఎటువంటి రికార్డులు సృష్టించనుందో తెలియాలంటే వేచిచూడాల్సిందే.

సినిమాపై భారీగానే అంచనాలు

గతంలో టీమ్​ఇండియా స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ ధోనీ బయోపిక్​ తీస్తున్న సమయంలో అందులో ఎవరు నటిస్తున్నారు? మహీ పాత్ర చేసే నటుడు ఎలా చేస్తాడా? అని అభిమానుల్లో సందేహం ఉండేది. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ అద్భుతంగా ధోనీ పాత్రను పండించాడు సుశాంత్. సినిమా విడుదల తర్వాత సినీ వీక్షకులతో పాటు క్రికెట్​ ప్రేమికులు.. తమ మదిలో ఇతడికి స్థానం కల్పించారంటేనే అర్ధం చేసుకోవచ్చు. అంతకు ముందు బాలీవుడ్​లో సుశాంత్ సినిమాలు చేసినా సరే, కేవలం 'ధోని'తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మళ్లీ 'దిల్​ బెచారా'పై అంతకు మించిన అంచనాలు ఏర్పడ్డాయి. ఇది పెద్ద హిట్​ అవుతుందనే పూర్తి నమ్మకంతో ఉన్నారు అభిమానులు.

ఆకట్టుకునే కథ

2014లో వచ్చిన హాలీవుడ్‌ రొమాంటిక్‌ డ్రామా 'ది ఫాల్ట్‌ ఇన్‌ అవర్‌ స్టార్స్‌'కు రీమేక్‌ 'దిల్‌ బెచారా. ఇద్దరు క్యాన్సర్‌ పేషెంట్ల మధ్య సాగే ప్రేమ కథతో దీనిని తెరకెక్కించారు. సైఫ్‌ అలీ ఖాన్‌ ఇందులో అతిథి పాత్రలో కనిపించనుండటం విశేషం. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతమందించగా, ముఖేశ్ చబ్రా దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

జూన్​ 14న ముంబయిలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు సుశాంత్​. అప్పటి నుంచి బాలీవుడ్​లో చర్చ నడుస్తూనే ఉంది. పోస్టుమార్టమ్​లో అతడిది ఆత్మహత్య అని తేలినప్పటికీ.. అభిమానులు, పలువురు నటీనటులు మాత్రం ఇండస్ట్రీలోని నెపోటిజమ్​ సుశాంత్ మృతికి కారణమని అంటున్నారు. సుశాంత్​కు సినిమా అవకాశాలు రాకుండా చేసి, ఒత్తిడికి గురిచేశారని అందుకే ఇలా చేసుకోవాల్సి వచ్చిందని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై సీబీఐ దర్యాప్తు చేయించాలని కోరుతున్నారు.

అయితే ఇప్పటికే ఈ కేసుతో సంబంధముందనే ఆరోపణల నేపథ్యంలో సుశాంత్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, పలువురు సినీ ప్రముఖల్ని పోలీసులు ప్రశ్నించారు. వారి నుంచి స్టేట్​మెంట్స్ తీసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.