ETV Bharat / sitara

బాక్సాఫీస్ వద్ద సుశాంత్, అవసరాల శ్రీనివాస్ పోటీ - new telugu movies

యువహీరో సుశాంత్​ నుంచి వస్తోన్న కొత్త సినిమా విడుదల తేదీ ప్రకటించింది చిత్రబృందం. అలాగే అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ జంటగా నటించిన '101 జిల్లాల‌ అంద‌గాడు' మూవీ రిలీజ్​ డేట్​ కూడా కన్ఫర్మ్ అయింది. ఈ రెండు సినిమాలు ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ruhani
సుశాంత్
author img

By

Published : Aug 13, 2021, 12:28 PM IST

టాలీవుడ్​ యువహీరో సుశాంత్​ కొత్త చిత్రం 'ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు' విడుదల తేదీ వచ్చేసింది. ఈ నెల 27న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానునట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాతో దర్శన్​ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్. ఏ1 స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్​ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

sushanth
'ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు'

ఇక నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ నటించిన '101 జిల్లాల‌ అంద‌గాడు' సినిమా కూడా ఆగస్టు 27నే విడుదలకానుంది. ఈ చిత్రానికి సాగర్​ రాచకొండ దర్శకత్వం వహించాడు. ఇందులో రుహానీ శర్మ కథానాయికగా నటిస్తోంది. నిర్మాత దిల్​రాజు​ సమర్పణలో రూపొందిందీ చిత్రం.

sushanth
'101 జిల్లాల‌ అంద‌గాడు'

ఇదీ చూడండి: పుష్ప 'దాక్కో దాక్కో మేక' సాంగ్​ వచ్చేసింది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.