ETV Bharat / sitara

వివాదంలో సుశాంత్​ సింగ్ బయోపిక్ నటుడు​ - sushant singh biopic

సుశాంత్ బయోపిక్​లో నటిస్తున్న నటుడు సచిన్​ తివారీకి 'శశాంక్' చిత్ర దర్శకనిర్మాతలు లీగల్ నోటీసులు పంపించారు. తమ కథను వేరే నిర్మాతతో పంచుకున్నాడని ఆరోపించారు.

Sushant Singh
సుశాంత్
author img

By

Published : Aug 26, 2020, 9:37 AM IST

బాలీవుడ్​ హీరో సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ ఆత్మహత్య తర్వాత ఇండస్ట్రీలో బంధుప్రీతిపై చెలరేగిన వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అతడి జీవిత కథ ఆధారంగా తీస్తున్న సినిమా కూడా వివాదాల్లో చిక్కుకుంది. సుశాంత్ పాత్రలో నటిస్తున్న సచిన్ తివారీకి దర్శక-నిర్మాతలు లీగల్ నోటీసులు పంపించారు.

అసలేం జరిగింది?

సుశాంత్​ మృతితో పాటు ఇండస్ట్రీలోని నెపోటిజమ్ ఆధారంగా తీస్తున్న చిత్రం 'సూసైడ్​ ఆర్​ మర్డర్'. సుశాంత్​ను పోలిన​ నటుడు సచిన్​ తివారీ టైటిల్​ రోల్​లో నటిస్తున్నాడు. ఇటీవలే పోస్టర్​ కూడా విడుదల చేశారు.

ఇప్పుడు ఈ విషయమై నిర్మాత మారుత్​ సింగ్​, దర్శకుడు సనోజ్​ మిశ్రా.. సచిన్​కు లీగల్​ నోటీసులు పంపించారు. తాము తీయబోయే 'శశాంక్' సినిమా కోసం సచిన్​ సంతకం చేశాడని, ఇప్పుడు ఆ కథను వేరే నిర్మాతలకు చెప్పాడని ఆరోపించారు. 'శశాంక్'​ చిత్రాన్ని కూడా సుశాంత్​ జీవిత కథ ఆధారంగా రూపొందించనున్నారు.

Sushant Singh
సుశాంత్​ బయోపిక్ ఫస్ట్​లుక్ పోస్టర్​

"సచిన్ తివారీకి మేం లీగల్​ నోటీసు పంపించి ఇప్పటికే నెల దాటింది. కానీ అతడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మా ఫోన్​ కాల్స్​కు కూడా అతడు స్పందించడం లేదు. ఈ విషయం మమ్మల్ని చాలా నిరాశపరిచింది. బాలీవుడ్​లో వివాదాస్పదమైన సుశాంత్​ మరణంలో అనేక కోణాలను విశ్లేషిస్తూ ఈ బయోపిక్​ తీయాలనుకున్నాం. తివారీకి స్క్రిప్ట్​ కూడా వినిపించాం. కానీ అతడు వేరే నిర్మాతలతో​ మా కథ చెప్పినట్లు తెలిసింది"

మారుత్​ సింగ్​, సినీ దర్శకుడు

అయితే, సచిన్​ కథ చెప్పిన ఆ నిర్మాత ఎవరనే విషయాన్ని మారుత్​ వెల్లడించలేదు. 'సూసైండ్​ ఆర్​ మర్డర్'​ చిత్రాన్ని విజయ్ శేఖర్​ గుప్తా నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్​లో ఉన్న బంధుప్రీతి గురించి ప్రధానంగా చూపించనున్నారు. ఓ చిన్న ఊరు నుంచి నుంచి వచ్చిన ఓ వ్యక్తి, నటుడిగా అవకాశాలు దక్కించుకోవడం కోసం పడిన కష్టాల ఆధారంగా 'శశాంక్'​ చిత్రం రూపొందనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.