ETV Bharat / sitara

సుశాంత్​ సింగ్​ బంధువుపై కాల్పులు - సుశాంత్​ సింగ్​ బంధువుపై కాల్పులు

బాలీవుడ్​ దివంగత నటుడు సుశాంత్​ సింగ్​ బంధువు(తమ్ముడు వరుస ) సహా అతడితో ఉన్న మరో వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ప్రస్తుతం వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

sus
సుశాంత్​
author img

By

Published : Jan 30, 2021, 9:56 PM IST

బాలీవుడ్​ దివంగత నటుడు సుశాంత్​ సింగ్ బంధువుపై దాడి జరిగింది. గుర్తుతెలియని ముగ్గురు దుండగులు ​​అతడితో సహా తనతో ఉన్న మరో వ్యక్తిపై కాల్పులు జరిపారు. ప్రస్తుతం వీరిద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

​సుశాంత్​ బంధువు(తమ్ముడు వరుస) రాజ్​కుమార్​ సింగ్​కు బిహార్​లోని సహార్స, మధెపురా, సౌపాల్​ జిల్లాల్లో మూడు యమహా బైక్​ షోరూమ్స్​ ఉన్నాయి. ప్రతిరోజు ఈ మూడు షోరూమ్స్​కు వెళ్తాడు. అలాగే శనివారం(నేడు) కూడా ఉదయం 11.30 సమయంలో అలీ హాసన్​తో కలిసి సహర్స జిల్లాలోని షోరూమ్​కు వెళ్తుండగా మధ్య దారిలో ముగ్గురు దుండగులు వీరిపై కాల్పులు జరిపి పారిపోయారు.

తక్షణమే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని చెప్పారు. అయితే అలీ హాసన్​ పరిస్థితి విషమంగా ఉంది.

సుశాంత్​ సింగ్​.. జూన్14న ముంబయిలోని తన ఇంట్లోని గదిలో అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉన్నారు.

ఇదీ చూడండి: సుశాంత్​ సింగ్ డ్రీమ్​ ప్రాజెక్ట్​.. త్వరలోనే సెట్స్​పైకి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.