ఆత్మహత్య చేసుకుని తనువు చాలించిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ముంబయిలోని విల్లే పార్లేలో దహన సంస్కారాలు నిర్వహించారు కుటుంబ సభ్యులు.
కుటుంబ సభ్యులు, బంధువులు, ఆప్త మిత్రుల సమక్షంలో సుశాంత్ అంతిమ సంస్కారాలు జరిగాయి. 34 ఏళ్ల ప్రాయంలోనే తనువు చాలించిన సుశాంత్ చివరి చూపు కోసం అభిమానులూ తరలిరాగా.. కరోనా కారణంగా ఎక్కువ మందికి అనుమతించలేదు.