ETV Bharat / sitara

సుశాంత్​ మృతితో కలత చెంది విద్యార్థి ఆత్మహత్య

హీరో సుశాంత్ ​సింగ్​ రాజ్​పుత్​​ మృతితో కలత చెంది తాజాగా బిహార్​కు చెందిన ఓ 12 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తన గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

Sushant Singh Rajput's 12-year-old fan ends life in UP
సుశాంత్​ మృతికి కలత చెంది విద్యార్థి ఆత్మహత్య
author img

By

Published : Jun 22, 2020, 5:07 PM IST

బాలీవుడ్​ నటుడు సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ మరణంపై కలత చెంది బిహార్​కు చెందిన ఓ 12 ఏళ్ల బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ హీరో ఆత్మహత్య చేసుకున్న విధంగా ఈ బాలుడూ ఉరి వేసుకుని చనిపోయాడని పోలీసులు వెల్లడించారు.

పోలీసుల కథనం ప్రకారం.. వారం రోజులుగా సుశాంత్​ మరణవార్తలను చూస్తూ ఆ బాలుడు టీవీకి అతుక్కుపోయాడని కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో తీవ్రంగా కలత చెంది శనివారం తన గదిలో ఉరి వేసుకుని ఉంటాడని పోలీసులు వెల్లడించారు. కుటుంబసభ్యుల అభ్యర్థనతో పోస్టుమార్టం నిర్వహించలేదని అసిస్టెంట్​ పోలీస్​ సూపరిటెండెంట్​ సర్వేస్​ మిశ్రా స్పష్టం చేశారు.

"బాలుడు తాను ఆత్మహత్య చేసుకోవడానికి గల స్పష్టమైన కారణాలంటూ ఏవీ లేవు. సోషల్​మీడియాలో వచ్చే వార్తల నుంచి పిల్లలను దూరంగా ఉంచాలని తల్లిదండ్రులను కోరుతున్నాం" అని సర్వేశ్​ మిశ్రా తెలిపారు.

ఫ్యాన్స్​ ఆత్మహత్యలు

సుశాంత్​ మృతితో దిగ్భ్రాంతి చెందిన కొంతమంది ఆయన అభిమానులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బరౌలీకి చెందిన పదవ తరగతి విద్యార్థి, ఒడిశాలో ఓ యువతి, అదే విధంగా అండమాన్​ నికోబార్​ దీవుల్లో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ఇదీ చూడండి... 'సుశాంత్​ కుటుంబానికి అండగా ఉండండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.