బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఇండస్ట్రీలో పెద్ద దుమారానికే దారితీసింది. సుశాంత్ మరణం తర్వాత చాలామంది బంధుప్రీతి అంశంపై మాట్లాడుతున్నారు. కొంతమంది అతడిది హత్య అంటూ ఆరోపిస్తున్నారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై సీబీఐ దర్యాప్తు అవసరమో లేదో అనే అంశాన్ని పరిశీలించడానికి ఇటీవల భాజపా రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్య స్వామి ఓ లాయర్‌ను నియమించారు. తాజాగా సుశాంత్‌ది హత్యే అంటూ 26 పాయింట్లతో కూడిన డాక్యుమెంట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
"సుశాంత్‌ది హత్యే అని నేను అనుకోవడానికి గల కారణాలు" అంటూ డాక్యుమెంట్ ఫొటోను నెట్టింట షేర్ చేశారు స్వామి. "సుశాంత్ మెడపై ఉన్న మరకలు చూస్తే అది ఆత్మహత్య కాదు హత్య అని స్పష్టమవుతుంది. మళ్లీ అతడి శరీరంపై దాడి చేసినట్లు కూడా ఉంది" అనే ఆధారాలు ఈ డాక్యుమెంట్లో ఉన్నాయి.
-
Why I think Sushanth Singh Rajput was murdered pic.twitter.com/GROSgMYYwE
— Subramanian Swamy (@Swamy39) July 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Why I think Sushanth Singh Rajput was murdered pic.twitter.com/GROSgMYYwE
— Subramanian Swamy (@Swamy39) July 30, 2020Why I think Sushanth Singh Rajput was murdered pic.twitter.com/GROSgMYYwE
— Subramanian Swamy (@Swamy39) July 30, 2020
ఈ డాక్యుమెంట్‌ను షేర్ చేయడానికి ముందు రోజే స్వామి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను కలిసి ఈ ఆధారాలను చూపించినట్లు తెలిపారు. నితీశ్ ఈ విషయమై సీబీఐ దర్యాప్తు జరిపేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పినట్లు వెల్లడించారు.