బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్‌కు న్యాయం జరగాలంటూ, పాట్నాకు చెందిన జన్ అధికార్ విద్యార్థి సంఘం రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపింది. నగరంలోని కార్గిల్ చౌక్‌వద్ద బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, నిర్మాత కరణ్ జోహార్ దిష్టిబొమ్మలను తగలబెట్టారు. పలువురు సినీ ప్రముఖుల అమానుష చర్యల వల్లే సుశాంత్‌కు సంబంధించిన ఏడు సినిమాలు చేజారిపోయాయని నిరసనకారులు అన్నారు.
"సుశాంత్ సింగ్ ఆత్మహత్య వెనుక బాలీవుడ్ ప్రముఖుల హస్తం ఉంది. అతడిని స్టార్‌గా ఎదగనివ్వకుండా అడ్డుకున్నారు. సినీ నేపథ్యం లేకపోవడం వల్ల వివక్ష చూపించారు. ఈ విషయంపై దర్యాపు చేపట్టి నిందితుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలి"
-విశాల్ కుమార్, జన్ అధికార్ విద్యార్థి సంఘం అధ్యక్షుడు
సుశాంత్ ఆత్మహత్య కేసును సీబీఐకు అప్పగించాలని జన్ అధికార్ విద్యార్థి సంఘం నాయకుడు నితీశ్ కోరారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటేనే సుశాంత్ ఆత్మ శాంతిస్తుందని వెల్లడించారు.
సుశాంత్ మరణానికి కారణం నెపోటిజమ్ ఓ కారణమని పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే ఆరోపణలు చేశారు. అతడి ఆత్మహత్యకు హీరో సల్మాన్, నిర్మాత కరణ్ జోహార్, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, నిర్మాత ఏక్తా కపూర్లు కారణమని బిహార్‌లోని ఓ న్యాయవాది సుధీర్‌కుమార్ ఓజా ఇటీవలే ఫిర్యాదు చేశారు.
ఇది చూడండి :