ETV Bharat / sitara

ఈ ఏడాది టాప్ సెర్చ్​డ్ సెలబ్రిటీస్​గా సుశాంత్, రియా​ - ఇంటర్నెట్​లో ఎక్కువగా శోధించిన సెలబ్రిటీ

ఈ ఏడాది భారత ప్రజలు అంతర్జాలంలో ఎక్కువగా శోధించిన ప్రముఖుల పేర్లను యాహూ సెర్చ్​ ఇంజిన్​ సంస్థ మంగళవారం ప్రకటించింది. దివంగత నటుడు సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ గురించి తెలుసుకోవడానికి ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపారని తెలిపింది. ఇందులో సుశాంత్​తో పాటు దివంగత సినీప్రముఖులైన ఇర్ఫాన్​ ఖాన్​, రిషి కపూర్​, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి వారు ఈ జాబితాలో ఉన్నారని వెల్లడించింది.

Sushant Singh Rajput is the most searched celebrity of 2020, according to search engine list
నెటిజన్లు ఎక్కువగా సెర్చ్​ చేసిన సెలబ్రిటీ సుశాంత్​
author img

By

Published : Dec 1, 2020, 3:51 PM IST

Updated : Dec 2, 2020, 9:48 AM IST

భారత్​లో ఈ ఏడాది అంతర్జాలంలో అత్యధికంగా వెతికిన పేర్లను, కార్యక్రమాల జాబితాను ప్రముఖ సెర్చ్ ఇంజిన్ సంస్థ యాహూ మంగళవారం వెల్లడించింది. దివంగత నటుడు సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ పేరును నెటిజన్లు ఎక్కువగా సెర్చ్​ చేశారని పేర్కొంది. నటీనటుల వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవడానికి ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని ఆ జాబితా తెలియజేస్తోంది. జూన్​లో ఆత్మహత్యకు పాల్పడిన సుశాంత్​ పేరు ఎక్కువగా ట్రెండ్​ అయ్యిందని యాహూ సర్వే తెలిపింది. ​

భారత్​లో అత్యధికంగా నెట్టింట శోధించిన పురుష సెలబ్రిటీ సుశాంత్​ అని.. మహిళల్లో నటి రియా చక్రవర్తి గురించి తెలుసుకోవడానికి ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపారని యాహూ వెల్లడించింది.

"2020లో సుశాంత్​ రాజ్​పుత్​ గురించి ప్రజలు ఎక్కువగా సెర్చ్​ చేయడం వల్ల.. భారత్​లో 'అత్యంత శోధించిన వ్యక్తి'గా దివంగత నటుడు సుశాంత్​ నిలిచాడు. సుశాంత్​ రాజ్​పుత్​, ఇర్ఫాన్​ ఖాన్​, రిషి కపూర్​, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంలు ఈ ఏడాది ఎక్కువగా శోధించిన టాప్​-10లోని దివంగత ప్రముఖులైతే.. ఆ జాబితాలో సుశాంత్​ తొలిస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత అమితాబ్​ బచ్చన్​, అక్షయ్​ కుమార్​, సల్మాన్​ ఖాన్​ వంటి వారు ఆ జాబితాలో ఉన్నారు" అని యాహూ సంస్థ వెల్లడించింది.

2020లో ఎక్కువగా శోధించిన ప్రముఖులు (పురుషులు):

  1. సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​
  2. అమితాబ్​ బచ్చన్​
  3. అక్షయ్​ కుమార్​
  4. సల్మాన్​ ఖాన్​
  5. ఇర్ఫాన్​ ఖాన్​
  6. రిషి కపూర్​
  7. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
  8. సోనూసూద్​
  9. అనురాగ్​ కశ్యప్​
  10. అల్లుఅర్జున్​

2020లో ఎక్కువగా శోధించిన ప్రముఖులు (మహిళలు):

  1. రియా చక్రవర్తి
  2. కంగనా రనౌత్​
  3. దీపికా పదుకొణె
  4. సన్నీ లియోనీ
  5. ప్రియాంకా చోప్రా
  6. కత్రినా కైఫ్​
  7. నేహా కక్కర్​
  8. కనికా కపూర్​
  9. కరీనా కపూర్​
  10. సారా అలీఖాన్​

ఇదీ చూడండి: సుశాంత్ ఆఖరి సందేశం అదేనా?

Last Updated : Dec 2, 2020, 9:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.