ETV Bharat / sitara

సుశాంత్​ను రియా వేధించింది: అంకిత - సుశాంత్ ఆత్మహత్య

సుశాంత్ ఆత్మహత్య కేసుపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. పలువురు సెలబ్రిటీలను విచారణ చేస్తున్నారు పోలీసులు. తాజాగా పట్నా పోలీసు స్టేషన్​లో సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిపై ఫిర్యాదు చేశారు అతడి తండ్రి కేకే సింగ్. రాజ్​పుత్ మాజీ ప్రేయసి అంకిత లోఖండే కూడా పట్నా పోలీసులతో కొన్ని కీలక విషయాలు పంచుకున్నట్లు సమాచారం.

సుశాంత్​ను రియా వేధించింది: అంకిత
సుశాంత్​ను రియా వేధించింది: అంకిత
author img

By

Published : Jul 30, 2020, 9:29 AM IST

సుశాంత్ ఆత్మహత్య విషయమై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా ఈ హీరో తండ్రి కేకే సింగ్ బిహార్ పోలీస్ స్టేషన్​లో రియా చక్రవర్తిపై కేసు నమోదు చేశారు. సుశాంత్ చనిపోవడానికి ఆమె కారణమంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ముంబయి పోలీసుల నుంచి కేసు విషయమై సమాచారం సేకరించడంలో నిమగ్నమయ్యారు పట్నా పోలీసులు. అయితే సుశాంత్ మాజీ ప్రేయసి అంకిత లోఖండే కూడా పలు కీలక విషయాలను వారితో పంచుకున్నట్లు సమాచారం.

రియా చక్రవర్తి తనను వేధిస్తున్నట్లు సుశాంత్ అప్పట్లో అంకితతో చెప్పాడట. అలాగే రియాతో రిలేషన్​ షిప్​ ఇక తన వల్ల కాదని తామిద్దరం విడిపోదామనుకుంటున్నట్లు కూడా వెల్లడించాడట. ఈ విషయాల్ని అంకిత.. సుశాంత్​ కుటుంబంతో పాటు పోలీసులకు తెలిపినట్లు తెలుస్తోంది.

సుశాంత్​ను రియా వేధించింది: అంకిత
సుశాంత్​ను రియా వేధించింది: అంకిత

అంకిత, సుశాంత్.. 'పవిత్ర రిష్తా' అనే టీవీ సీరియల్​లో కలిసి నటించారు. ఆరేళ్ల పాటు రిలేషన్​లో ఉన్న వీరిద్దరూ భేదాభిప్రాయాల వల్ల విడిపోయారు. సుశాంత్ మరణం తర్వాత అంత్యక్రియల సందర్భంలో సుశాంత్ కుటుంబాన్ని కలిసింది అంకిత. తర్వాత పట్నాకు వెళ్లి కలిసిన సందర్భంలో రియా-సుశాంత్​ల గురించి వారి కుటుంబానికి తెలియజేసిందని సమాచారం.

తాజాగా సోషల్ మీడియాలో అంకిత షేర్ చేసిన పోస్టుపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 'ఎప్పటికైనా నిజం గెలుస్తుంది' అంటూ పోస్ట్ చేసిందీ నటి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.