ETV Bharat / sitara

థియేటర్లలో సుశాంత్ సింగ్ 'దిల్​ బెచారా' - sushant singh rhea

ఆస్ట్రేలియా థియేటర్లలో సుశాంత్ సింగ్ 'దిల్​ బెచారా' సినిమా విడుదల కానుంది. అక్టోబరు 15 నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది.

sushant singh rajput dil bechara in australia theatres
సుశాంత్ దిల్​ బెచారా సినిమా
author img

By

Published : Sep 30, 2020, 10:27 AM IST

యువ నటుడు సుశాంత్ సింగ్ చివరి చిత్రం 'దిల్​ బెచారా'.. ఓటీటీలో జూలై 24న విడుదలై, విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. అయితే తమ ఆరాధ్య నటుడి సినిమాను, కరోనా ప్రభావం వల్ల వెండితెరపై చూడలేకపోయామని అభిమానులు చాలా బాధపడ్డారు.

ఇప్పుడు వారికి కాస్త ఆనందం కలిగించే వార్త ఇది. ఆస్ట్రేలియాలో త్వరలో థియేటర్లు తిరిగి తెరుచుకోనున్న నేపథ్యంలో మన సినిమాల్ని అక్కడ విడుదల చేయనున్నారు. వీటిలో లూట్​కేస్(అక్టోబరు 8), దిల్ బెచారా(అక్టోబరు 15), సడక్ 2(అక్టోబరు 22) ఉన్నాయి. దీంతో ఆ దేశంలో ఉన్న సుశాంత్ అభిమానులు సంతోషపడిపోతున్నారు.

ఇద్దరు క్యాన్సర్​ పేషంట్ల మధ్య సాగే కథతో 'దిల్​ బెచారా'ను తెరకెక్కించారు. సుశాంత్ సరసన సంజన సంఘీ హీరోయిన్​గా నటించింది. ముకేశ్ చబ్రా దర్శకత్వం వహించారు.

ఇది చదవండి: సుశాంత్ సింగ్​తో పాటు రియా చక్రవర్తి బయోపిక్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.