ETV Bharat / sitara

సుశాంత్​ కేసులో పోలీస్​స్టేషన్​కు రాజీవ్​ మసంద్​ - రాజీవ్​ మసంద్​

బాలీవుడ్​ యంగ్​ హీరో సుశాంత్​ సింగ్​ ఆత్మహత్య కేసులో ప్రముఖ సినీ విమర్శకుడు రాజీవ్​ మసంద్​ స్టేట్​మెంట్​ను రికార్డు చేశారు పోలీసులు. ఇప్పటివరకు ప్రముఖ దర్శకుడు సంజయ్​ లీలా భన్సాలీతో పాటు దాదాపు 35 మందిని విచారించారు.

sushant
సుశాంత్​
author img

By

Published : Jul 21, 2020, 3:55 PM IST

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ సింగ్ రాజ్​పుత్ ఆత్మహత్య కేసు విషయమై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు ముంబయి పోలీసులు. తాజాగా ప్రముఖ సినీ విమర్శకుడు(ఫిల్మ్​ క్రిటిక్​) రాజీవ్​ మసంద్​ను బాంద్రా పోలీస్​ స్టేషన్​లో విచారించారు. అతడి స్టేట్​మెంట్​ను రికార్డు చేశారు.

గతంలో సుశాంత్ నటన సహా అతడి రెమ్యునరేషన్‌పై విమర్శలు చేశాడు రాజీవ్​. అయితే ఇవి కక్ష్యపూరితంగా చేశాడా? లేదా?.. అవి నటుడి పై ఎలాంటి ప్రభావం చూపాయో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులు.

ఇప్పటివరకు 35మంది

వృత్తి ప‌రంగా నెల‌కొన్న వివాదాలు సహా ప్రేమ వ‌ల్ల మానసికంగా కుంగిపోయి సుశాంత్​ ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రముఖ దర్శకుడు సంజయ్​ లీలా భన్సాలీ, దర్శకనిర్మాత యశ్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్యా చోప్రా సహా మరికొంత మంది సినీ ప్రముఖులను పోలీసులు విచారించారు.

సుశాంత్ కుటుంబసభ్యులు, సన్నిహితుల స్టేట్​మెంట్స్​ను రికార్డు చేశారు పోలీసులు. మొత్తంగా దాదాపు 35మందిపై విచారణ జరిపారు. గత నెలలో ముంబయిలోని తన అపార్ట్‌మెంట్‌లో సుశాంత్ సింగ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇది చూడండి : కిర్గిస్థాన్​లో చిక్కుకున్న వేల మందికి సోనూ సాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.