ETV Bharat / sitara

రియా పిటిషన్​పై బుధవారం సుప్రీం తీర్పు - సుశాంత్​ కేసు సీబీఐ దర్యాప్తు

సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్ కేసును బిహార్​ నుంచి ముంబయికి బదిలీ చేయాలంటూ రియా చక్రవర్తి సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై ధర్మాసనం బుధవారం (ఆగస్టు 18న) తుది నిర్ణయం ప్రకటించనుంది.

Sushant Singh Rajput case
రియా
author img

By

Published : Aug 18, 2020, 10:26 PM IST

సుశాంత్ సింగ్ రాజ్​పుత్ ఆత్మహత్య కేసును పట్నా(బిహార్​) నుంచి ముంబయికి బదిలీ చేయాలంటూ రియా చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు రేపు (బుధవారం) తన నిర్ణయాన్ని ప్రకటించనుంది.

సుశాంత్ సింగ్ మృతి కేసును సీబీఐ ఇప్ప‌టికే ద‌ర్యాప్తు చేస్తోంది. నటుడి తండ్రి కేకే సింగ్ అభ్య‌ర్థ‌న మేర‌కు బిహార్ ప్ర‌భుత్వం కేంద్రాన్ని కోర‌గా.. కేంద్రం సీబీఐ ద‌ర్యాప్తుకు ఓకే చెప్పింది. దీంతో సీబీఐ రంగంలోకి దిగి బిహార్ పోలీసులు న‌మోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా మ‌రో ఎఫ్ఐఆర్‌ను న‌మోదు చేసి కేసు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అందులో రియా చ‌క్ర‌వ‌ర్తిని అధికారులు ఏ1గా చేర్చారు.

అయితే బిహార్ పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్న కేసును ముంబయికి బదిలీ చేయాల‌ని, ఇందులో సీబీఐ జోక్యం అవ‌స‌రం లేద‌ని కోరుతూ రియా చక్ర‌వ‌ర్తి సుప్రీం కోర్టులో పిటిష‌న్ వేసింది. ఈ నేపథ్యంలో రియా వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు గ‌త వారం నుంచి విచారిస్తోంది. ఈ క్ర‌మంలో ఆమె పిటిష‌న్‌పై అత్యున్నత న్యాయస్థానం ఆగస్టు 18న తీర్పునివ్వ‌నుంది.

ఇది చూడండి ప్రభాస్​ చిత్రంలో నివేదా థామస్​?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.