ETV Bharat / sitara

సుశాంత్ కేసు: మరోసారి ఈడీ ముందుకు రియా - sushant death case news updates

బాలీవుడ్​ హీరో సుశాంత్​ సింగ్​ ఆత్మహత్య కేసులో భాగంగా సోమవారం మరోసారి రియా చక్రవర్తిని ఈడీ ప్రశ్నించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆమె సోదరుడు షోయిక్​నూ విచారణకు పిలవనున్నట్లు పేర్కొన్నారు.

Sushant Singh Rajput case
సుశాంత్​
author img

By

Published : Aug 9, 2020, 4:05 PM IST

బాలీవుడ్​ హీరో సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్ ఆత్మహత్య​ కేసులో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​(ఈడీ) దర్యాప్తు వేగవంతం చేసింది. తాజాగా నటుడి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి రియా చక్రవర్తి సోదరుడు షోయిక్​ చక్రవర్తిని రెండోసారి అధికారులు విచారించారు.

శనివారం మధ్యాహ్నం ఈడీ కార్యాలయానికి వెళ్లిన షోయిక్​.. దాదాపు 18 గంటల తర్వాత ఆదివారం ఉదయం 7గంటలకు బయటకు వచ్చాడు. అయితే ఈడీ ప్రశ్నలకు షోయిక్​ సరైన సమాధానలు చెప్పడం లేదని అధికారులు తెలిపారు. కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోందని అన్నారు. ఈ క్రమంలోనే సోమవారం మళ్లీ పిలిపించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

రియాను కూడా సోమవారం మరోసారి విచారించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదే కేసులో శుక్రవారం సుమారు 8 గంటల పాటు రియాను ఈడీ ప్రశ్నించింది. ఆమె చార్టర్డ్​ అకౌంటెంట్​ రితేశ్​ షా, మాజీ మేనేజర్​ శ్రుతి మోదీలనూ చాలాసేపు విచారించింది. సుశాంత్ తండ్రి కృష్ణ కిశోర్​ సింగ్​ పట్నా పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు.. మనీల్యాండరింగ్​ కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.

ఇదీ చూడండి:సుశాంత్​ కేసులో ఈడీ దర్యాప్తు సాగిందిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.