ETV Bharat / sitara

సుశాంత్​ కేసు: ఈడీ ఎదుట హాజరైన రియా సోదరుడు

author img

By

Published : Aug 8, 2020, 5:16 PM IST

బాలీవుడ్ నటుడు, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో విచారణను వేగవంతం చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్(ఈడీ). ఇందులో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి సోదరుడు షోయిక్‌ చక్రవర్తి నుంచి శనివారం పలు వివరాలు ఆరా తీశారు అధికారులు.

Sushant Singh Rajput case: ED grills Rhea's brother Showik Chakraborty yet again
సుశాంత్​ కేసు: ఈడీ ఎదుట హాజరైన రియా సోదరుడు

సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న షోయిక్​ చక్రవర్తిని ఇవాళ మరోసారి విచారించింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్(ఈడీ). నటి రియాకు స్వయానా సోదరుడైన షోయిక్​... ముంబయిలోని ఈడీ కార్యాలయానికి హాజరయ్యాడు. సుశాంత్​తో కలిసి రియా, షోయిక్​ డైరెక్టర్లుగా నిర్వహించిన రెండు కంపెనీల ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించనున్నట్లు సమాచారం.

ముందురోజే...

ఇప్పటికే మనీలాండరింగ్‌ కేసులో భాగంగా ఆగస్టు 7న రియా చక్రవర్తి, ఆమె మాజీ మేనేజర్ శ్రుతి మోదీ, ఆమె చార్టర్డ్​​ అకౌంటెంట్​ రితేశ్ సహా షోయిక్​ తొలిసారి ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యాడు. అప్పుడు వృత్తి, ఆదాయం, ఖర్చుల నిర్వహణ వంటి పలు అంశాలపై ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. వాటిని ఎన్​ఫోర్స్​మెంట్​ కేసు ఇన్ఫర్మేషన్​ రిపోర్టు(ఈసీఐఆర్​)లో నమోదు చేసినట్లు సమాచారం. ప్రాపర్టీ డీలర్​ శామ్యూల్​ మ్రిందాను ఈడీ అధికారులు విచారించినట్లు తెలుస్తోంది.

విజయ్​ మాల్యా, అగస్టా వెస్ట్​ల్యాండ్​ కేసులను విచారించిన సిట్​ బృందంమే ఈ కేసును విచారిస్తోంది.

జూన్​ 14న ముంబయి బాంద్రాలోని తన ఇంటిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు సుశాంత్​. మృతికి కారణంగా పేర్కొంటూ జులై 28న బిహార్​లో ఆరుగురిపై కేసు నమోదు చేశారు సుశాంత్​​ తండ్రి కేకే సింగ్​.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.