ETV Bharat / sitara

సుశాంత్​ కొన్నాళ్లుగా మందులు వాడటమే మానేశాడు! - Sushant Singh Rajput cremation

హీరో సుశాంత్ సింగ్ రాజ్​పుత్.. తీవ్రమైన ఒత్తిడి వల్లే తనువు చాలించినట్లు తేలింది. అయితే గత కొన్నాళ్ల నుంచి ఇతడు, వైద్యులు సూచించిన మందులు వాడటమే మానేశాడు.

సుశాంత్ కొన్నాళ్లుగా మందులు వాడటమే మానేశాడు!
హీరో సుశాంత్ సింగ్ రాజ్​పుత్
author img

By

Published : Jun 15, 2020, 1:28 PM IST

బాలీవుడ్​ హీరో సుశాంత్ సింగ్ రాజ్​పుత్ ఆత్మహత్య వార్త.. ప్రతి ఒక్కరిని కదలించింది. అంత మంచి నటుడు, 34 ఏళ్లకే ఎందుకు తనువు చాలించాడు? చనిపోవాల్సి వచ్చిందా? ప్రేమ వ్యవహారం దీనికి కారణమా? ఇలా రకరకాల ప్రశ్నలు.. అభిమానుల మనసుల్ని తొలచివేశాయి. అయితే పోస్టుమార్టం అనంతరం కొన్ని బాధ కలిగించే అంశాలు బయటకొచ్చాయి.

సుశాంత్ ఇంట్లో లభించిన కొన్ని మెడికల్ రిపోర్ట్స్​ ఆధారంగా అతడు, కొన్నినెలల నుంచి హైపర్​ టెన్షన్, మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు తెలిసింది. వీటిని తగ్గించేందుకు డాక్టర్ ఇచ్చిన మందులను కొన్నాళ్ల నుంచి వేసుకోవడమే మానేశాడు. సుశాంత్​కు ఆర్థికపరమైన ఇబ్బందులు లేవని, అతడి బ్యాంక్​ ఖాతాలో చాలానే డబ్బున్నట్లు స్పష్టమైంది.

sushanth singh rajput
హీరో సుశాంత్ సింగ్ రాజ్​పుత్

సుశాంత్​కు తన ప్రేయసి రియా చక్రవర్తితో కొన్నిరోజుల క్రితం గొడవైంది. దీంతో వీరిద్దరూ మాట్లాడుకోవడం మానేశారు. చనిపోవడానికి ముందు ఆమెతో పాటు తన స్నేహితుడు మహేశ్ శెట్టితో మాట్లాడేందుకు సుశాంత్ ప్రయత్నించగా వారు స్పందించలేదు.

అయితే పోలీసులు, ఈ కేసు దర్యాప్తులో భాగంగా.. రియా, మహేశ్, సుశాంత్ మాజీ ప్రేయసి అంకిత లోకండేతో పాటు అతడు​ ఆత్మహత్యకు పాల్పడ్డ 24 గంటల ముందు ఎవరెవరితో మాట్లాడాడో వారందరిని విచారించేందుకు సిద్ధమవుతున్నారు.

హీరో సుశాంత్ సింగ్​ అంత్యక్రియలు సోమవారం.. విలే పార్లేలో జరగనున్నాయి. ఇప్పటికే అతడి కుటుంబ సభ్యులు ముంబయికి చేరుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.