ETV Bharat / sitara

సుశాంత్​ కేసు: 'చట్టపరంగా మేమూ దర్యాప్తు చేయవచ్చు'

సుశాంత్​ రాజ్​పుత్ ఆత్మహత్యకు సంబంధించిన కేసును పట్నా పోలీసులు విచారించడం చట్టపరంగా చెల్లుతుందని సుప్రీంకోర్టుకు తెలిపింది బిహార్​ రాష్ట్ర ప్రభుత్వం. ఈ కేసులో మహారాష్ట్ర పోలీసులు సహకరించడం లేదని ఆరోపించింది.

Sushant death case: Bihar Police calls Mumbai's probe a facade
సుశాంత్​ మృతి కేసు: 'చట్టపరంగా మేమూ దర్యాప్తు చేయవచ్చు'
author img

By

Published : Aug 11, 2020, 5:50 PM IST

బాలీవుడ్​ నటుడు సుశాంత్​​ సింగ్ రాజ్​పుత్ ఆత్మహత్య కేసును పట్నా​లో నమోదు చేయడం చట్టపరంగా చెల్లుబాటు అవుతుందని మంగళవారం బిహార్​ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ కేసులో మహారాష్ట్ర పోలీసులు సహకరించడం లేదని ఆరోపించింది. కనీసం సుశాంత్​కు సంబంధించిన పోస్ట్​మార్టమ్​ రిపోర్టును కూడా ముంబయి పోలీసులు అందించలేదని బిహార్​ గవర్నమెంట్​ వెల్లడించింది.

ఆయన హస్తం ఉంది

సుశాంత్​ మరణంపై ముంబయి పోలీసులు ఇప్పటికీ ఎఫ్​ఐఆర్​ నమోదు చేయలేదని బిహార్​ ప్రభుత్వ తరపు న్యాయవాది మనీందర్​ సింగ్​.. జస్టిస్​ హృషికేశ్​ రాయ్​ నేతృత్వం వహించిన ధర్మాసనానికి వెల్లడించారు. రాజకీయ ఒత్తిడి, పక్షపాతం కారణంగా నటి రియా చక్రవర్తిపై బిహార్​ రాష్ట్ర గవర్నమెంట్​ నేరారోపణలు మోపుతుందన్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఈ కేసును పట్నా నుంచి ముంబయికి బదిలీ చేయాలన్న నటి రియా వ్యాజ్యంపై వాదనలు జరిగాయి. దీని వెనుక బిహార్​ ముఖ్యమంత్రి హస్తం ఉందని.. దర్యాప్తు చేయడానికి ఆయనే వ్యక్తిగతంగా ఓ ఐపీఎస్​ ఆఫీసర్​ను నియమించారన్న వాదనలను బలంగా తిప్పికొట్టారు న్యాయవాది మనీందర్​ సింగ్​.

ఎందుకు ఆలస్యం చేశారు?

సుశాంత్​ మృతికి నటి రియా కారణమని ఆరోపణలతో అతడి తండ్రి పట్నాలో కేసు నమోదు చేశారని.. అయితే సుశాంత్​ మృతికి పట్నాకు ఎలాంటి సంబంధం లేని రియా తరపు న్యాయవాది శ్యామ్​ దివాన్​ ధర్మాసనానికి తెలియజేశారు. కేవలం పక్షపాతంతోనే ఈ కేసు పెట్టారని తెలిపారు. ఫిర్యాదు చేయడానికి 38 రోజులు ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. సుశాంత్​ తండ్రి కేకే సింగ్​ చేసిన ఫిర్యాదుతో ముంబయి పోలీసులకు సంబంధం ఉందని దివాన్​ పేర్కొన్నారు. ముంబయి పోలీసులు ఈ కేసు దర్యాప్తులో ఇప్పటికే 56 మందిని విచారణ చేసినట్లు తెలిపారు.

తమ రాష్ట్ర పరిధిలో ఉన్న కేసును పట్నా పోలీసులు దర్యాప్తు చేయడాన్ని వ్యతిరేకించారు మహారాష్ట్ర తరపు న్యాయవాది అభిషేక్​ మను సింఘ్వి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.