ETV Bharat / sitara

ఆ సినిమాలో న్యాయవాదిగా సూర్య!

author img

By

Published : May 8, 2021, 6:30 AM IST

తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం టి.జి జ్ణానవేల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో ఆయన న్యాయవాది పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.

Surya
సూర్య

"కోర్టులో వాదించడమూ తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు" అంటూ పవన్‌కల్యాణ్‌ 'వకీల్‌సాబ్‌'గా చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఓ మాస్‌ హీరో నల్ల కోటు ధరిస్తే ఆ హంగామా ఎలా ఉంటుందో అందులో చూశాం. ఇప్పుడు మరో హీరో ఆ కోటులో కనిపించి వినోదం పంచనున్నారా? అంటే అవుననే అంటున్నాయి తమిళ సినీ వర్గాలు. ఆ హీరో ఎవరో కాదు.. సూర్య.

టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో సూర్య 39వ చిత్రం రూపొందుతోంది. అందులో సూర్య.. న్యాయవాదిగా కనిపించనున్నారని తెలుస్తోంది. అదే నిజమైతే ఆయన తొలిసారి ఈ పాత్రలో కనిపించినట్టు అవుతుంది. తమిళంతోపాటు తెలుగులోనూ బలమైన మార్కెట్‌ని సొంతం చేసుకున్న కథానాయకుడు సూర్య. ఆయన నటించే దాదాపు అన్ని సినిమాలు తెలుగులోనూ విడుదలవుతుంటాయి. ఎప్పటికప్పుడు విలక్షణమైన పాత్రల్లో కనిపిస్తుంటారు సూర్య. 'ఆకాశం నీ హద్దురా'లో విమానయాన సంస్థ వ్యవస్థాపకుడిగా మారిన ఓ సామాన్య యువకుడిగా కనిపించి అలరించిన విషయం తెలిసిందే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.