స్టార్ హీరో సూర్య వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు. ఆయన 39వ సినిమా 'జై భీమ్'. ఇందులో న్యాయవాదిగా నటిస్తున్నారు. జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
చంద్రు.. హైకోర్టు రిటైర్డ్ జడ్జి. ఈయన తన పదవీకాలంలో 96 వేల కేసులను పరిష్కరించారు. 1993లో ఆయన న్యాయవాదిగా ఉన్నప్పుడు ఓ గిరిజన మహిళ న్యాయం కోసం పోరాటం చేశారు. సూర్య నటించబోయే సినిమా ఆ కేసు ఆధారంగానే రూపొందించనున్నట్లు సమాచారం. ఇందులో సూర్య.. రిటైర్డ్ జడ్జి, లాయర్‌గా కనిపించనున్నారట. మనికందన్, లిజొమోల్ జోస్, రజిష విజయన్, ప్రకాశ్‌రాజ్(పోలీస్ ఆఫీసర్‌గా) కీలక పాత్రలు పోషిస్తున్నారు. సీన్ రోల్డన్ స్వరాలు సమకూరుస్తున్నారు.



సూర్య ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాల్లోనూ నటిస్తున్నారు. పాండిరాజ్ దర్శకత్వంలో 'ఎత్రక్కుమ్ తునిందవన్' చేస్తున్నారు. ఇది కూడా వాస్తవ సంఘటనల ఆధారంగా తీస్తున్నారు. అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పొలాచ్చి గ్యాంగ్‌రేప్ ఆధారంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర లుక్స్ ఆకట్టుకుంటున్నాయి.

వెట్రిమారన్ దర్శకత్వంలో 'వడివాసల్', 'నవరస' వెబ్‌సిరీస్‌లోనూ ఆయన ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన వీటి ఫస్ట్‌లుక్స్ కూడా అదిరిపోయాయి! హీరో మాధవన్ స్వీయదర్శకత్వంలో తీస్తున్న 'రాకెట్రీ'లోనూ అతిథి పాత్రలో సూర్య మెరవనున్నారు.

ఇదీ చూడండి: Suriya Birthday: సూర్య అసలు పేరేంటో తెలుసా?