నటుడు సూర్య.. తన చిత్రం 'జై భీమ్'పై వచ్చిన విమర్శలపై స్పందించారు. ఇందులోని సన్నివేశాలు తమిళనాడు ఉత్తర భాగానికి చెందిన 'వన్నియార్లు' అనే కమ్యూనిటీని అవమానించిందని పీఎంకే యువజన నాయకుడు అన్బుమణి రామదాస్ ఆరోపించారు. దీనిపై సూర్య ఏ విధంగా స్పందించారంటే?
నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నా..
"నా తోటి మనుషుల జీవితాలను మెరుగుపరిచేందుకు నా వంతు గట్టి ప్రయత్నం చేస్తున్నాను. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుంచి నాకు మద్దతు ఉంది. ఎవరినీ దూషించి పబ్లిసిటీ పొందాలనే ఉద్దేశం కానీ, అవసరం కానీ నాకు లేదు. ఏ వర్గాన్నీ అవమానించే ఉద్దేశం మా చిత్ర బృందానికి లేదు. కొన్ని ఉదంతాలు ఎత్తిచూపిన వెంటనే సినిమాలో మార్పులు చేశాం. ఏదైనా ఒక వర్గాన్ని కించపరిచేందుకు భావప్రకటనా స్వేచ్ఛను ఉయోగించుకూడదు"
నిరూపిస్తాం... వాటికి ఆధారాలు ఉన్నాయి
ఈ చిత్రం ఒక డాక్యుమెంటరీ కాదు. ఒక వాస్తవ సంఘటన ఆధారంగా కథ కల్పితమని డిస్‌క్లైమర్ (disclaimer)తో మొదలువుతుంది. ఇందులోని సన్నివేశాలు కానీ పేర్లు కానీ ప్రత్యేకంగా ఒకరిని లేదా ఏదైనా సంఘటనను ఉద్దేశించి తీసినవి కావు. బలహీనత గురించి నిజంగా పట్టించుకోని వారు వారిపై తమ అధికారాన్ని ఉపయోగిస్తారు. ఇందులో కులం, మతం, భాష, జాతి అనే పట్టింపులు ఉండవు ప్రపంచమంతటా దీనిని నిరూపించడానికి ఆధారాలు ఉన్నాయి.
ఇవీ చదవండి: