ETV Bharat / sitara

SureshRaina: క్రికెటర్ రైనా బయోపిక్​లో సూర్య? - సురేశ్​ రైనా బయోపిక్​ సూర్య

ఒకవేళ తన బయోపిక్​ తీస్తే తమిళ స్టార్​ హీరో సూర్య అందులో నటించాలని అన్నాడు మాజీ క్రికెటర్ సురేశ్ రైనా. చెన్నై అంటే తనకెంతో ఇష్టమని చెప్పాడు. ఇటీవల ఇన్​స్టా లైవ్​లో పాల్గొన్న ఇతడు.. దీనితోపాటు పలు విషయాల్ని పంచుకున్నాడు.

suresh raina biopic
సురేశ్​ రైనా బయోపిక్​
author img

By

Published : Jun 26, 2021, 1:37 PM IST

కోలీవుడ్​ స్టార్​ హీరో సూర్య అంటే టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ సురేశ్​​ రైనా(చెన్నై సూపర్​ కింగ్స్​)కు ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు సందర్భాల్లో ఈ కథానాయకుడిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఇటీవల ఇన్​స్టా లైవ్​​లో పాల్గొన్న రైనా.. తన బయోపిక్​ను హీరో సూర్యతో(Tamil Star Surya) తీస్తే బాగుంటుందని మనసులో మాటను బయటపెట్టాడు.

రైనా ఆత్మకథ.. 'బిలీవ్‌: వాట్‌ లైఫ్‌ అండ్‌ క్రికెట్‌ టాట్‌ మి' (నమ్మకం: జీవితం, క్రికెట్‌ నాకేం బోధించిందంటే) పుస్తక రూపంలో ఇటీవల విడుదలైంది. దీని ప్రచారంలో భాగంగా రైనా ఇన్​స్టా లైవ్​ సెషన్స్​లో తరచుగా పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగానే తన బయోపిక్​ గురించి మాట్లాడాడు.

"దేశానికి లేదా చెన్నై సూపర్​కింగ్స్​కు ఆడటం అంత తేలికైనా విషయం కాదు. ఆ ఎమోషన్​ను కళ్లకు కట్టేలా చూపించగలిగే నటుడు నా బయోపిక్​లో నటించాలి. అది దక్షిణాది నటులైతే బాగా చేయగలరు. ఎందుకంటే చెన్నై, సీఎస్కే నాకు ఎంత ఇష్టమో వాళ్లు అర్థం చేసుకోగలరు. నా మనసులో రెండు మూడు పేర్లు ఉన్నాయి. సూర్య చేయాలని భావిస్తున్నాను. అతడు తప్పనిసరిగా నటిస్తాడని అనుకుంటున్నాను. దుల్కర్​ సల్మాన్​ కూడా బాగా నటించగలడు."

-సురేశ్​ రైనా(SureshRaina), టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​.

గతేడాది రిటైర్మెంట్​ ప్రకటించిన రైనా.. టీమ్​ఇండియా తరఫున 18టెస్టులు(768 పరుగులు, 13వికెట్లు), 226వన్డేలు(5615, 36), 78టీ20(1604,13) ఆడాడు. ఐపీఎల్​లో ప్రస్తుతం చెన్నై సూపర్​కిింగ్స్​కు ఆడుతున్నాడు.

ఇదీ చూడండి: Raina: లక్ష్యాలను ఛేదించడం ఛాపెల్​ నేర్పారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.