ETV Bharat / sitara

డ్రగ్స్​ కేసు: కన్నడ నటి రాగిణికి బెయిల్​ మంజూరు​

డ్రగ్స్​ వినియోగం కేసులో కన్నడ నటి రాగిణి దివ్వేదికి ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకు బెయిల్​ మంజూరు చేస్తున్నట్లు గురువారం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

Supreme Courts Grants Bail to Actress Ragini Dwivedi in Sandalwood Drug case
డ్రగ్స్​ కేసు: కన్నడ నటి రాగిణికి బెయిల్​ మంజూరు​
author img

By

Published : Jan 21, 2021, 12:52 PM IST

మాదకద్రవ్యాల వినియోగం కేసులో జైలుకు వెళ్లిన కన్నడ నటి రాగిణి ద్వివేదికి ఊరట లభించింది. ఈ కేసులో భాగంగా ఆమెకు బెయిల్​ మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు గురువారం తీర్పునిచ్చింది.

ఏం జరిగిందంటే?

గతేడాది సెప్టెంబరులో.. ఓ డ్రగ్స్​ పెడ్లర్​తో నటి రాగిణి ద్వివేదికి సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చాయి. వారిద్దరూ కలిసి డ్రగ్స్​ సరఫరా చేస్తున్నారన్న నేపథ్యంలో మాదకద్రవ్యాల నిరోధక చట్టం కింద అక్టోబరులో ఆమెను అరెస్టు చేసి.. జైలుకు తరలించారు. ఆమెతో సహా ఈ కేసుకు సంబంధం ఉన్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తీర్పును సవాలు చేస్తూ..

అయితే, తన దగ్గర డ్రగ్స్​కు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని అంటున్న సదరు నటి.. బెయిల్​ కోసం నవంబరు 3న కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ ఆమెకు చుక్కెదురవ్వడం వల్ల.. ఆ తీర్పును సవాలు చేస్తూ, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో గురువారం సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. వాదనలు విన్న ధర్మాసనం.. రాగిణికి బెయిల్​ మంజూరు చేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది.

ఇదీ చూడండి: పరువునష్టం కేసులో కంగనకు సమన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.