ETV Bharat / sitara

మెడపై పచ్చబొట్టుతో మాస్ లుక్​లో మహేశ్ - mahesh babu parasuram

సూపర్​స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా మహేశ్ కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్​లుక్​ను రిలీజ్​ చేశారు. ఈ చిత్రానికి 'సర్కారు వారిపాట' అనే పేరు పెట్టారు.​

SSMB 27
మహేశ్​బాబు
author img

By

Published : May 31, 2020, 9:14 AM IST

Updated : May 31, 2020, 10:14 AM IST

సూపర్​స్టార్ మహేశ్​బాబు కొత్త సినిమా అప్​డేట్ వచ్చేసింది. ఈ చిత్రానికి 'సర్కారు వారిపాట' అనే క్రేజీ టైటిల్ పెట్టారు. 'గీతగోవిందం' ఫేమ్ దర్శకుడు పరశురామ్ దీనిని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్​టైన్​మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్ సంగీతమందించనున్నాడు.

MAHESH BABU NEW CINEMA
మహేశ్​ కొత్త సినిమా పోస్టర్

ఇందులో హీరోయిన్​గా కియారా అడ్వాణీ నటించనుందని సమాచారం. దీనితో పాటే ఇతర సాంకేతిక సిబ్బంది వివరాలను మరికొన్నిరోజుల్లో వెల్లడించనున్నారు.

'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో ఈ ఏడాది ఆరంభంలోనే మహేశ్‌ హిట్‌ అందుకున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్రలో కనిపించారు. దీని విడుదల తర్వాత‌ కుటుంబంతో కొంతకాలంపాటు విదేశాలకు వెళ్లి వచ్చారు మహేశ్. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమై తన చిన్నారులతో సరదాగా గడుపుతున్నారు. ఆయా ఫొటోలను నమ్రత ఇన్‌స్టా వేదికగా పంచుకుంటున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా తర్వాత రాజమౌళి-మహేశ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రానుంది.

Last Updated : May 31, 2020, 10:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.