ETV Bharat / sitara

krishna birthday: 'సీతారామరాజు' పాత్రతో కృష్ణ సంచలనం! - krishna movies

సూపర్​స్టార్ కృష్ణ కెరీర్​లో 100వ చిత్రంగా వచ్చిన అల్లూరి సీతారామరాజు.. టాలీవుడ్​లో ఓ​ ల్యాండ్​మార్క్​గా నిలిచింది! నేడు కృష్ణ పుట్టినరోజు సందర్భంగా, ఆ చిత్రం తెరకెక్కించడానికి పడ్డ కష్టాలు తదితర అంశాల గురించే ఈ స్టోరీ. మే 1 నాటికి ఈ సినిమాకు 47 ఏళ్లు పూర్తి కావడం విశేషం.

Superstar Krishna birthday
సూపర్​స్టార్ కృష్ణ
author img

By

Published : May 31, 2021, 9:00 AM IST

Updated : May 31, 2021, 9:31 AM IST

సాయుధ పోరాటంతో గిరిజనుల బతుకు మారేటి, వెతలు తీరేటి ఉద్యమం చేపట్టిన విప్లవజ్యోతి, తెలుగువారి ఖ్యాతి, తరతరాలకు స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు. తెల్లదొరల వెన్నులో వణుకు పుట్టించి, గుండెల్లో నిద్రించిన సింహస్వప్నం. అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు చరిత్రను వెండితెరపై ఒక మహాద్భుత దృశ్యకావ్యంగా మలిచిన ఘనత హీరో కృష్ణకు దక్కింది. సూపర్ స్టార్ నటించిన 100 చిత్రంగా ఖ్యాతిని అందుకుంది. సోమవారం(మే 31), కృష్ణ పుట్టినరోజు ఆ సందర్భంగా ఆ విశేషాలు మీకోసం.

తెల్లదొరల దుష్పరిపాలను తుదముట్టించాలని పిలుపునిచ్చిన తెలుగువీరుడు, విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు. నీతి లేని శాసనాలు, నీతిబాహ్య విధానాలు.. వ్యాపారం పేరుతో వచ్చి, ఈదేశంలో తిష్టవేసి యదేచ్ఛగా దోపిడీలకు, దుర్మార్గాలకు, పాల్పడిన దుండగులు తెల్లవాళ్లు. అలాంటి దుష్పరిపాలనకు, దురంతాలకు వ్యతిరేకంగా మన్యం ప్రజలను కదలించారు. తుదిసమరం మొదలు పెట్టి బ్రిటిష్ పాలనకు చరమగీతం పాడాలని గిరిజనాన్ని కదలించారు. విప్లవ శంఖారావం పూరించారు అల్లూరి.

ముందుగా ప్రకటించి పోలీసు స్టేషన్ల మీద విల్లంబులతో దాడులు, తుపాకులు ఎత్తుకెళ్లి తెల్లదొరల కంటి మీద కునుకు లేకుండా చేశారు. రగిలిన విప్లవాగ్నిని చల్లార్చాలని, అల్లూరి సీతారామరాజును బంధించాలని ప్రభుత్వం రూ.10 వేల బహుమతి ప్రకటించింది. పైసలకు గడ్డికరవబోమని, తమ ఆరాధ్యుడికి హాని తలపెట్టబోమని మన్యం ప్రజలు తీర్మానించారు. చివరకు నది ఒడ్డున స్నానం చేసి ధ్యానం చేయబోతున్న అల్లూరిని చుట్టుముట్టి కాల్చిచంపిన ఘాతకులు, పాతకులు తెల్లదొరలు. ఈ చరిత్రను తరతరాలకు స్ఫూర్తిగా అందించేందుకు.. సినిమాగా తేవటానికి ఎవరూ ముందుకు రాలేదు. నటరత్న ఎన్టీ రామారావు ఎన్నాళ్లుగానో స్క్రిప్టు సిద్ధం చేసుకున్నట్లు చెబుతుండేవారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు అల్లూరి సీతారాజు చిత్రం చేయాలన్న ప్రతిపాదనలను నిర్మాతలు తెచ్చినా.. వారు వెనుకడుగు వేశారు. ఇటువంటి సమయంలో హీరో కృష్ణ, త్రిపురనేని మహారథితో స్క్రిప్టు రాయించారు. చలికి జడవక, వ్యాధులకు వెరవక హీరో కృష్ణ.. మూడునెలలు విశాఖ జిల్లా చింతపల్లి ఏజెన్సీలో బసచేసి ఈ సినిమా షూటింగ్ చేశారు. అల్లూరి సీతారామరాజు, 1974 మే 1న విడుదలై ఘనవిజయం సాధించింది.

తొలిసారి తెలుగు చిత్రసీమలో వచ్చిన సినిమా స్కోప్ చిత్రంగా నిలిచింది. హీరో కృష్ణ వీరోచితంగా, హీరోచితంగా నటించారు. సీతారామరాజు డైలాగులకు ప్రేక్షకులకు అణువణువూ పులకించింది. సినిమా 19 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం లభించింది. సినిమాలో 'తెలుగు వీర లేవరా' పాట రాసిన మహాకవి శ్రీశ్రీకి ఉత్తమ సినీ గీత రచయితగా జాతీయ పురస్కారం వరించింది. 'అసాధ్యుడు' సినిమాలో అల్లూరి సీతారామరాజు నృత్యనాటకంలో నటించిన స్ఫూర్తితోనే కృష్ణ ఈ చిత్రం నిర్మించడం విశేషం.

ప్రస్తుతం రాజమౌళి తీస్తున్న 'ఆర్ఆర్ఆర్'లో మెగాహీరో రామ్​చరణ్, అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. అప్పట్లో కృష్ణ టాలీవుడ్​లో సంచలనం సృష్టిస్తే.. ఇప్పుడు చరణ్ తన మేకోవర్​తో ఇంకెన్ని అద్భుతాలు చేస్తారో చూడాలి?

Last Updated : May 31, 2021, 9:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.