ETV Bharat / sitara

రజనీ​ 'అన్నాత్తె' రిలీజ్​ డేట్​ వచ్చేసిందోచ్​!

తమిళ సూపర్​స్టార్ రజనీకాంత్​ ప్రధానపాత్రలో నటిస్తున్న 'అన్నాత్తె'(Annaatthe) సినిమా విడుదలపై చిత్రబృందం స్పష్టత ఇచ్చింది. దీపావళి కానుకగా (Annaatthe Release Date) చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు గురువారం చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

Super Star Rajinikanth movie Annaatthe gets a release date
రజనీ​ 'అన్నాత్తె' రిలీజ్​ డేట్​ వచ్చేసిందోచ్​!
author img

By

Published : Jul 1, 2021, 8:47 PM IST

సూపర్​స్టార్​ రజనీకాంత్​ ప్రధానపాత్రలో శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'అన్నాత్తె' (Rajini Annaatthe). గతేడాది దీపావళికి విడుదల కావాల్సిన చిత్రం కరోనా సంక్షోభం కారణంగా వాయిదా పడింది. ఇటీవలే షూటింగ్​ను చిత్రబృందం తిరిగి ప్రారంభించగా.. ఇప్పుడు తుదిదశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలపై చిత్రబృందం స్పష్టత ఇచ్చింది.

ఈ ఏడాది దీపావళి కానుకగా నవంబరు 4న (Annaatthe Release Date) చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్​ చేయనున్నట్లు నిర్మాణసంస్థ సన్​ పిక్చర్స్​ ప్రకటించింది. దీంతో రజనీ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపినట్లైంది. ఈ చిత్రంలో రజనీకాంత్​తో పాటు కీర్తి సురేశ్‌, నయనతార, మీనా, కుష్భూ, ప్రకాశ్‌రాజ్‌ కీలకపాత్రలు (Annaatthe Cast) పోషిస్తున్నారు.

చికిత్స కోసం అమెరికాకు..

గత డిసెంబరులో రజనీకాంత్‌ అస్వస్థతకు గురవడం వల్ల షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది చిత్రబృందం. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని, ఆ తర్వాత వైద్యుల సూచన మేరకు రజనీ విశ్రాంతి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే చికిత్స కోసం కుటుంబ సమేతంగా ఆయన అమెరికా వెళ్లారు. త్వరలోనే చికిత్స పూర్తి చేసుకొని భారత్​కు తిరిగి రానున్నారని తెలుస్తోంది.

రజనీ రిటైర్మెంట్​?

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌.. ఏడు పదుల వయసులోనూ ఏమాత్రం ఉత్సాహం తగ్గకుండా సినిమాల్లో నటిస్తున్నారు. ఐదు దశాబ్దాల క్రితం మొదలైన ఆయన సినీ ప్రయాణంలో 160కి పైగా చిత్రాల్లో నటించి దేశంలోనే అగ్రకథానాయకునిగా ఎదిగారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానం సొంతం చేసుకున్నారాయన.

అయితే రజనీ సినీ ప్రయాణం చరిత్రగా మారనుందా..? సూపర్‌ స్టార్‌ సినిమాలకు వీడ్కోలు (Rajinikanth retirement) పలకబోతున్నారా..? అనే చర్చలు ఈ మధ్య జోరుగా సాగుతున్నాయి. దానికి తోడు ఇటీవల ఆయన పదేపదే అనారోగ్యానికి గురవుతుండటం దీనికి మరింత బలం చేకూరుస్తోంది. అయితే దీనికి సంబంధించి రజనీకాంత్‌.. 'అన్నాత్తె' చిత్రబృందంతో మాట్లాడారట.

హైదరాబాద్​లో 'అన్నాత్తె' షూటింగ్​ జరుగుతున్న రోజుల్లో చిత్రబృందంతో కలిసి రజనీకాంత్​ సరదాగా ముచ్చటించారట. తనకు మరికొన్నాళ్లు సినిమాల్లో నటించాలని ఉందని, కానీ ఆరోగ్యం సహకరిస్తుందో లేదో చూడాలని తన మనసులోని మాట బయట పెట్టారట.

ఇదీ చూడండి.. 'కేజీఎఫ్​ 2' ఆడియో రైట్స్​కు రికార్డు ధర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.