ETV Bharat / sitara

వలస కార్మికులకు సాయంగా సన్నీలియోని - దిల్లీలో వలస కార్మికులకు సన్నీలియోన్​ సాయం

బాలీవుడ్​ అందాలతార సన్నీ లియోని.. తన ఉదారతను చాటుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దిల్లీలోని 10 వేల మంది వలస కార్మికులకు ఆహారాన్ని అందించేందుకు ఆమె ముందుకొచ్చారు. ఈ కార్యక్రమానికి పీపుల్​ ఫర్​ ఎథికల్​ ట్రీట్​మెంట్​ ఆఫ్​ యానిమల్స్​(పెటా) సహకారాన్ని అందిస్తుంది.

Sunny Leone, PETA India to donate 10,000 meals to Delhi migrant workers
వలస కార్మికులకు సాయంగా సన్నీలియోన్​
author img

By

Published : May 6, 2021, 11:02 AM IST

Updated : May 6, 2021, 11:42 AM IST

కరోనా సంక్షోభం నేపథ్యంలో దిల్లీలో ఉన్న 10 వేల మంది వలస కార్మికులకు ఆహారాన్ని అందించనున్నారు బాలీవుడ్​ నటి సన్నీ లియోని. అందుకోసం ఆమె పాటు పీపుల్​ ఫర్​ ఎథికల్​ ట్రీట్​మెంట్​ ఆఫ్​ యానిమల్స్​(పెటా) సంస్థ కూడా భాగమైంది.

"ప్రస్తుతం మనమంతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. ఇలాంటి సమయంలో అవసరమైన వారికి అండగా ఉండాలి. పెటా ఇండియాతో మరోసారి చేతులు కలపడం నాకు ఆనందంగా ఉంది. ఈసారి దిల్లీ నగరంలోని వేలాది కార్మికులకు అవసరమైన ఆహారాన్ని అందించాలని నిర్ణయించాం".

- సన్నీ లియోని​, బాలీవుడ్​ నటి

పదివేల మంది కార్మికులకు అందించే ఆహారంలో అన్నం, పప్పు లేదా కిచిడీతో పాటు కొన్ని పండ్లను అందించనున్నట్లు సన్నీ లియోని వెల్లడించారు. పెటా ఇండియా, సన్నీ ఉదయ్​ ఫౌండేషన్​ ద్వారా ఆహారాన్ని పంపిణీ చేయనున్నారు.

2016లో పెటా ఇండియా 'పర్సన్​ ఆఫ్​ ది ఇయర్​'గా నటి సన్నీలియోని​ ఎంపికయ్యారు. గతంలో శాఖాహారాన్ని స్వీకరించడం, జంతువుల సంరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాల్లో సన్నీ చురుగ్గా పాల్గొన్నారు.

ఇదీ చూడండి: కరోనాతో ప్రముఖ సినీ ఎడిటర్​ మృతి

Last Updated : May 6, 2021, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.