బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోని తన పిల్లల విషయంలో తీసుకునే శ్రద్ధ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నైపుణ్య శిక్షణకు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒకటి వారికి నేర్పిస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు తన కూతురు నిషాకు చిత్రలేఖన శిక్షణ ఇస్తూ బిజీగా ఉంటోంది. వారిద్దరు కలిసి గీసిన ఓ పెయింటింగ్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. "కలిసికట్టుగా పనిచేస్తున్నాం. నేనూ, నా చిన్ని రాకుమారి" అంటూ వ్యాఖ్య రాసుకొచ్చింది. ఈ చిత్రం నెటిజన్లను విపరీతంగా ఆక్టటుకుంటోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
కరోనా వల్ల లభించిన విరామ సమయంతో కొంతకాలంగా సన్నీ.. అమెరికాలో తన కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటోంది.
ఇదీ చూడండి నటి పూనమ్ పాండే భర్తకు బెయిల్