టీమ్ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అథియా శెట్టి ప్రేమాయణం గురించి చాలా వార్తలే వచ్చాయి. వారు కలిసి చక్కర్లు కొడుతున్న వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ సందడి చేశాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నాడు రాహుల్. అథియా కూడా అక్కడే ఉంది. తాజాగా ఈ విషయంపై స్పందించారు అథియా శెట్టి తండ్రి, బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి.
"అవును అథియా ఇంగ్లాండ్‌లో ఉంది. కానీ సోదరుడు అహాన్‌తో హాలీడే కోసం అక్కడికి వెళ్లింది. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు" అంటూ సమాధానమిచ్చారు సునీల్.
తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ రాహుల్, అథియా కలిసి నటించిన ప్రకటన గురించి స్పందించారు సునీల్. అది ఒక అంతర్జాతీయ బ్రాండ్ అని.. వారిద్దరిని బ్రాండ్ అంబాసిడర్లుగా తీసుకోవడం సంస్థ నిర్ణయమని తెలిపారు. అలాగే ఆ ప్రకటనలో వారి జోడీ అద్భుతంగా ఉందని కొనియాడారు. దీనిని ఓ ప్రకటన కోణంలోనే చూడాలని సూచించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇటీవలే సునీల్ శెట్టి తన ఇన్‌స్టా వేదికగా తనయుడు అహాన్‌తో పాటు రాహుల్ ఉన్న ఓ వీడియోను షేర్ చేశారు. దీనికి క్యాప్షన్‌గా 'నా ప్రేమ, నా ధైర్యం' అనే క్యాప్షన్ ఇచ్చారు. దీనిపై ఆయన్ని ప్రశ్నించగా.. తన ఫేవరెట్ క్రికెటర్లలో రాహుల్ ఒకడని.. అతడు, అహాన్ మంచి స్నేహితులని స్పష్టం చేశారు.