ETV Bharat / sitara

పాటతో ప్రారంభం కానున్న 'పుష్ప' షూటింగ్​!

author img

By

Published : Jun 16, 2020, 5:28 AM IST

స్టైలిష్ ​స్టార్​ అల్లు అర్జున్​ కొత్త సినిమా 'పుష్ప' చిత్రీకరణను జులై మొదటి వారం నుంచి ప్రారంభించడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోందట. హైదరాబాద్​లోని రామోజీ ఫిలింసిటీలో పాటతో షూటింగ్​ ప్రారంభించాలని అనుకుంటున్నట్లు సమాచారం.

Sukumar plans to resume shoot of the Pushpa Movie with a duet song in Hyderabad?
జులై నుంచి రామోజీ ఫిలింసిటీలో పుష్ప షూటింగ్​!

స్టైలిష్​స్టార్ అల్లు అర్జున్​, ​క్రియేటివ్​ డైరెక్టర్​ సుకుమార్​ కాంబినేషన్​లో తెరకెక్కుతోన్న చిత్రం 'పుష్ప'. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో జరిగే కథతో రూపొందుతోంది. ఇప్పటికే కేరళలోని అడవుల్లో తొలి షెడ్యూల్​ పూర్తి చేయగా.. లాక్​డౌన్​ కారణంగా చిత్రీకరణను నిలిపేశారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం షూటింగ్​లకు అనుమతి ఇచ్చిన కారణంగా జులై మొదటి వారం నుంచి చిత్రీకరణ ప్రారంభించాలని యూనిట్ భావిస్తోందట.

Sukumar plans to resume shoot of the Pushpa Movie with a duet song in Hyderabad?
'పుష్ప' ఫస్ట్​లుక్​

హైదరాబాద్​లోని రామోజీ ఫిలింసిటీలో ఓ పాటను హీరో, హీరోయిన్లతో చిత్రీకరించనున్నారని సమాచారం. అయితే కేరళలోని అడవుల్లో మిగిలిన సన్నివేశాలను తెరకెక్కించాల్సి ఉండగా.. అక్కడి వాతావరణం అనుకూలించకపోవడం వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ అడవుల్లో షూటింగ్​ చేయాలని ఇటీవలే చిత్రబృందం నిశ్చయించినట్లు సమాచారం.

'పుష్ప'.. బన్నీ, సుకుమార్​ల హ్యాట్రిక్​ చిత్రం కావడం వల్ల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రష్మిక హీరోయిన్​. దేవిశ్రీ ప్రసాద్​ సంగీతమందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే వచ్చిన ఫస్ట్​లుక్ ఆకట్టుకుంటోంది.

ఇదీ చూడండి... ఆ అడవుల్లో బన్నీ 'పుష్ప' షూటింగ్!​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.