దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకత, స్టార్ డమ్ సంపాదించుకున్న సుకుమార్.. రచయితగా తన శిష్యులకు కథలు ఇస్తుంటారు. కొన్ని సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరిస్తుంటారు. అలా తెరకెక్కిందే 'కుమారి 21 ఎఫ్'. తాజాగా సుకుమార్ మరోసారి ఆ తరహా ప్రయత్నం చేయబోతున్నాడు. ఓటీటీ ట్రెండ్‌ను ఫాలో అవుతూ... కథలు సిద్ధం చేశాడట. త్వరలోనే 'ఆహా' ఓటీటీ యాప్ కోసం వాటిని వెబ్ సిరీస్‌గా తెరకెక్కిస్తాడట.
ఓటీటీ కోసం సుకుమార్ తొమ్మిది ప్రేమకథలు సిద్ధం చేశాడట. అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన 'మోడరన్ లవ్' తరహాలో సుక్కు ప్రేమకథలు ఉంటాయని తెలుస్తోంది. ఓ అంతర్జాతీయ నవల ఆధారంగా ఈ ప్రేమకథలు రాసుకున్నాడని భోగట్టా. సుక్కు టీమ్ ఇప్పటికే వాటిని మన నేటివిటీకి తగ్గట్టుగా మార్చి సిద్ధం చేశాయట. అందులో ఓ రెండు కథలకు ఆయన దర్శకత్వం వహించనుండగా.. మిగిలిన వాటిని సుకుమార్ సన్నిహితులు, యువ దర్శకులు తెరకెక్కించనున్నారు. 'పుష్ప ' చిత్రీకరణ మొదలయ్యేముందే ఈ వెబ్‌సిరీస్ పని పూర్తి చేస్తారట. అయితే దీనిపై అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది.