ETV Bharat / sitara

సుశాంత్ జీవితం ఆధారంగా బాలీవుడ్ సినిమా - సుశాంత్ సినిమా

యువనటుడు సుశాంత్ సింగ్ జీవితం ఆధారంగా బాలీవుడ్​లో సినిమా తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్​ను విడుదల చేశారు.

సుశాంత్ జీవితం ఆధారంగా బాలీవుడ్ సినిమా
సుశాంత్ సింగ్ రాజ్​పుత్
author img

By

Published : Jun 19, 2020, 6:14 PM IST

యువహీరో సుశాంత్ సింగ్ రాజ్​పుత్ ఆత్మహత్య.. బాలీవుడ్​లో నెపోటిజమ్​తో పాటు ఉన్న పలు అంశాల్ని లేవనెత్తింది. ఈ నటుడు చనిపోవడానికి ఇండస్ట్రీలోని పలువురు బడా ప్రముఖులే​ కారణమని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్ జీవితం ఆధారంగా సినిమా తీసేందుకు దర్శకుడు షమీక్ మాలిక్ సిద్ధమయ్యారు. 'సుసైడ్ ఆర్ మర్డర్: ఏ స్టార్ వస్ లాస్ట్' పేరుతో తీస్తున్న చిత్ర పోస్టర్​ను విడుదల చేశారు. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్​లోకి అడుగుపెట్టిన వారు, ఎలాంటి కష్టాలు అనుభవిస్తారనే విషయాన్ని ఇందులో చూపించనున్నట్లు వెల్లడించారు.

film to be made on Sushant's life
సుశాంత్ జీవితం ఆధారంగా బాలీవుడ్ సినిమా

"ఇది సుశాంత్ సింగ్ బయోపిక్​ కాదు. బాలీవుడ్​లోని ఎవరికి తెలియని కొన్ని విషయాల్ని ఇందులో చూపించబోతున్నాం. అతడు చనిపోవడానికి కారణమైన వారి గురించి చెప్పనున్నాం. గత కొన్నాళ్లలో సుశాంత్​ను బెదిరించడం, నిషేధించడం సహా పలు సినిమాల నుంచి తప్పించారు" -షమీక్ మాలిక్, దర్శకుడు

మానసిక ఒత్తిడిని తట్టుకోలేక జూన్ 14న, తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు సుశాంత్ సింగ్. సుసైడ్ నోట్ దొరకకపోవడం వల్ల ఇతడితో సంబంధమున్న పలువుర్ని పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిని ఇప్పటికే ప్రశ్నించగా, అతడితో చేసుకున్న కాంట్రాక్టుల వివరాలు ఇవ్వాలని యశ్​రాజ్ ఫిల్మ్స్​కు పోలీసులు లేఖ రాశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.