ETV Bharat / sitara

ఆ జ్ఞాపకాల సమాహారమే 'గుర్తుందా శీతాకాలం'

author img

By

Published : Feb 22, 2021, 7:07 AM IST

సత్యదేవ్‌, తమన్నా ప్రధాన పాత్రలో నటించిన 'గుర్తుందా శీతాకాలం' సినిమాలో నటి సుహాసిని ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. కన్నడలో విజయవంతమైన 'లవ్‌ మాక్‌టేల్‌' ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.

satya
సత్యదేవ్​

సత్యదేవ్‌, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం 'గుర్తుందా శీతాకాలం'. నాగశేఖర్‌ దర్శకత్వం వహిస్తూ, భావనారవితో కలిసి నిర్మిస్తున్నారు. ఎమ్‌.ఎస్‌.రెడ్డి, చినబాబు సమర్పిస్తున్నారు. ఇందులో సుహాసిని ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.

"టీనేజ్‌, కాలేజీ రోజుల తర్వాత ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగే కొన్ని సంఘటనలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి ఆహ్లాదరకమైన సంఘటనలు ప్రేక్షకుల కళ్లకు కట్టే ప్రయత్నమే ఈ చిత్రం. ఇప్పటికే ఈ సినిమా పేరుకు మంచి స్పందన లభించింది. కన్నడలో విజయవంతమైన 'లవ్‌ మాక్‌టేల్‌' ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో సుహాసిని పాత్ర ఎంతో కీలకం. మేఘ ఆకాష్‌, కావ్యశెట్టి, ప్రియదర్శి తదితరులు పాత్రలు గుర్తుండిపోతాయి. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాల్ని వెల్లడిస్తామ"ని సినీ వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: తమన్నా-సత్యేదేవ్‌ల 'గుర్తుందా శీతాకాలం'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.