కన్నడ నటుడు సుదీప్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఫాంటమ్'. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను మార్చారు. దీనికి 'విక్రాంత్ రోనా' అనే టైటిల్ ఖరారు చేశారు. దీనికి సంబంధించిన టైటిల్ లోగోను దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై జనవరి 31న విడుదల చేయనున్నారు.
![Vikrant Rona](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10323809_sa.jpg)
ఇంకా విడుదల తేదీ ఖరారు చేయని ఈ చిత్రానికి అనూప్ భండారీ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.