బాలీవుడ్‌కు చెందిన ఓ నిర్మాణ సంస్థలో సాధారణ ఉద్యోగిగా చేరి నేడు స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయింది నటి భూమి పెడ్నేకర్. ఎన్ని విజయాలు సాధించినా.. తనలో కొంతైనా మార్పు రాలేదని అంటోంది.
"కెరీర్లో ఎంత పెద్ద విజయం వచ్చినా.. నాలో కొంచెం మార్పు కూడా రాలేదు. ఎందుకంటే నేనూ అందరిలాంటి అమ్మాయినే. ఎంత ఎత్తు ఎదిగినా ఇంకొన్ని లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంది. నాకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకోవాలి. యశ్‌రాజ్ ఫిల్మ్ సంస్థలో చేరే సమయానికి నాకు 17 ఏళ్లు. ఆ వయసులో నాకు ఏదీ తెలిసొచ్చేది కాదు. ఆ సమయంలో విదేశాలకు వెళ్లి చదువుకోవాలని అనిపించేది. అనుకోకుండా యశ్‌రాజ్ ఫిల్మ్ సంస్థలో ఇంటర్వ్యూకి వెళ్లాను. ఆ తర్వాత నా జీవితమే పూర్తిగా మారిపోయింది".
- భూమి పెడ్నేకర్, బాలీవుడ్ నటి
లాక్డౌన్ విరామ సమయంలో తన తల్లి దగ్గర కథక్ నృత్యాన్ని నేర్చుకుంది నటి భూమి పెడ్నేకర్. 2015లో 'దమ్ లగా కే హైసా' చిత్రంతో వెండితెరకు పరిచయమైన భూమి.. ఆ తర్వాత అక్షయ్ కుమార్‌తో నటించిన 'టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ'తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 'లస్ట్ స్టోరీస్', 'సొంచిరియా', 'సాండ్ కీ ఆంఖ్', 'బాలా', 'పతి పత్నీ ఔర్ వో' లాంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం 'దుర్గావతి' సినిమాతో సహా.. 'భాగమతి' హిందీ రీమేక్‌లో నటిస్తోంది.
ఇదీ చూడండి... 'షూటింగ్స్ ప్రారంభించడానికి ఇక ఆగలేము'