ETV Bharat / sitara

fahadh faasil birthday: ఛీ కొట్టిన వాళ్లే శెభాష్ అనేలా!

తండ్రి నిర్మాత, దర్శకుడు. 19ఏళ్లకే సినీరంగ ప్రవేశం. హీరోగా తొలి సినిమా ఫట్టు. ఘోరమైన విమర్శలు. సినిమాలకు గుడ్‌బై. విదేశాలకు పయనం. కట్‌ చేస్తే.. ఏడేళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి.. ఏడాదికి నాలుగైదు చిత్రాలు.. ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం. నాలుగు కేరళ రాష్ట్ర పురస్కారాలు.. సౌత్‌ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు.. అందమైన భార్య.. అంతకంటే అందమైన జీవితం. ఇప్పుడు కేవలం కేరళకే కాదు.. టాలీవుడ్‌తో పాటు యావత్‌ దేశం మెచ్చిన నటుడు. ఒక నటుడి ప్రయాణం విజయంవంతంగా సాగుతోందని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి..! ఈరోజు నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ మలయాళీ సంచలనంపై ప్రత్యేక కథనం..

Fahaad Fasil news
ఫహాద్‌ ఫాజిల్‌
author img

By

Published : Aug 8, 2021, 12:21 PM IST

నటనతో పాటు ఉత్తమ వ్యక్తిత్వం ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్నాడు ఫహాద్​ ఫాజిల్​. తండ్రి నిర్మాత స్థాయిలో ఉన్నా తొలుత తడబాటుకు గురై.. నెమ్మదిగా యాక్టింగ్​పై పట్టు సాధించాడు. మొదట్లో ఛీ అన్న వారి చేతే శెభాష్​ అనుకునేలా ఎదిగాడు. ఈ మలయాళీ నటుడి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం..

సహజత్వమే తన వ్యక్తిత్వం..

అబ్దుల్‌ హమీద్‌ మహమ్మద్‌ ఫహద్‌ ఫాజిల్‌.. ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ.. అందులోనే దాగి ఉన్న ఫహద్‌ ఫాజిల్.. మాత్రం ఇప్పుడు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. అతను నటుడిగా ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో.. తన స్వభావాన్ని మార్చుకునేందుకు అస్సలు ఇష్టపడని వ్యక్తిత్వం ఉన్న మనిషిగా అంత కంటే రెట్టింపు ప్రశంసలు అందుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో అప్పియరెన్స్‌ చాలా ముఖ్యం. నటనతో పాటు అందమైన ఆహార్యం కూడా కావాలి. అందంలో ఫహద్‌ తక్కువేం కాదు. అయితే.. ఫహద్‌కు జుట్టు తక్కువగా ఉన్న కారణంగా కొన్ని సందర్భాల్లో విగ్గు పెట్టుకోమని కొంతమంది సలహాలు ఇస్తుండేవారు. అయితే.. తన సహజత్వం కోల్పోవడానికి ఇష్టపడని ఆయన.. జట్టు తక్కువగా ఉన్నప్పటికీ బట్టతలతోనే సినిమాల్లో కనిపించేవాడు. కనిపిస్తున్నాడు కూడా. అయినా.. ఫహద్‌ను జనం ప్రేమిస్తున్నారు. కారణం ఏంటంటే అతని వ్యక్తిత్వమే.

Ffahadh faasil news
సహజత్వమే తన వ్యక్తిత్వం

తొలి అడుగే తడబాటై..

ప్రతి ఒక్కరి జీవితంలోనూ తొలి అడుగు ఎంతో కీలకం. ఊహ తెలిసిన తర్వాత మనం వేసే అడుగులనుబట్టే మన జీవితం సాగుతుంది. అయితే.. ఫహద్‌ మాత్రం ఆ తొలి అడుగు చెప్పిన తీర్పును మార్చి రాశాడు. 2002లో వచ్చిన 'కైయెతుమ్‌ దూరత్‌' చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఫహద్‌. రొమాంటిక్‌ డ్రామాగా వచ్చిన చిత్రాన్ని తన తండ్రి ఫాజిల్ తెరకెక్కించారు. తొలి సినిమాతోనే ఘోర పరాజయం. ఇంకేముంది 'నువ్వు నటుడిగా పనికిరావంటూ..' విమర్శలు. మానసికంగా తీవ్రంగా కుంగిపోయిన ఫహద్‌ సినిమాలు మన వల్ల కాదనుకొని పైచదువుల కోసం అమెరికా వెళ్లాడు. పడిపోయిన చోటే గట్టిగా లేచి నిల్చోవాలనుకున్నాడు. మళ్లీ ఏడేళ్ల తర్వాత మళ్లీ 2009లో రీ ఎంట్రీ ఇచ్చాడు. నువ్వు సినిమాలకు పనికిరావంటూ తొలి అడుగు చెప్పిన తీర్పును తప్పు అని నిరూపిస్తూ తన కెరీర్‌ను రూపొందించుకున్నాడు.

ముచ్చటైన ప్రేమ కథ..

Ffahadh faasil news
ముచ్చటైన ప్రేమ కథ

ఫహద్‌ ప్రేమ కథతోనూ ఓ సినిమా తీయొచ్చు. 'బెంగళూరు డేస్‌' అనే చిత్రంలో ఫహద్‌ సరసన హీరోయిన్‌తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఏడడుగుల వరకూ తీసుకెళ్లింది. ఆమే 'రాజా రాణి' చిత్రంతో ఎక్స్‌ప్రెషన్‌ క్వీన్‌గా కుర్రకారు మనసు దోచుకున్న నజ్రియా నజీమ్‌. నజ్రియాను చూడగానే ప్రేమలో పడ్డ ఫాజిల్.. ప్రేమలేఖలో ఉంగరం పెట్టి తన మనసులోని మాట వ్యక్తం చేశాడు. ఇంకేముంది రోటీన్‌గానే ఆమె 'ఎస్‌' అని చెప్పలేదు.. అలాగనీ 'నో' అని కూడా చెప్పకుండా సస్పెన్స్‌లో పడేసింది. కొంతకాలం ఆమె చుట్టూ తిరగడం.. చివరికి ఆమె పచ్చ జెండా ఊపడం జరిగిపోయాయి. చివరికి పెళ్లి. 21 ఆగస్టు 2014న తిరువనంతపురంలో రీల్‌ కపుల్‌ కాస్తా రియల్‌ కపుల్‌ అయ్యారు. ఇప్పటికీ 'నజ్రియా నా జీవితంలోకి వచ్చిన తర్వాతే అంతా మారిపోయింది. నేను సాధించే ప్రతి విజయంలోనూ ఆమె పాత్ర ఉంది' అంటాడు ఫహాద్‌.

ధైర్యంగా ఓటీటీలోకి దిగి..

ఒక స్టార్‌డమ్‌ వచ్చిన తర్వాత పెద్ద హీరోలు తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేసేందుకు సాహసం చేయరు. ఎందుకంటే.. పెట్టిన బడ్జెట్‌ ఓ కారణమైతే.. అభిమానులు సినిమాను థియేటర్లోనే చూడాలని కోరుకోవడం మరో కారణం. ఇవే దృష్టిలో పెట్టుకొని ఉంటే ఫహద్‌ ఓటీటీలో వరుసగా తన సినిమాలు విడుదల చేసేవాడు కాదేమో. అమెజాన్‌ ప్రైమ్‌లో గతేడాది సెప్టెంబర్‌లో విడుదలైంది 'సీ యు సూన్‌' ఆ తర్వాత 'ఇరుల్' నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది ఏప్రిల్ ‌2న.. ఆ వెంటనే ఏప్రిల్‌ 7న 'జోజి' విడుదలయ్యాయి. అంతేకాదు.. ఎట్టిపరిస్థితుల్లోనూ థియేటర్లలోనే విడుదల చేయాలనుకున్న భారీ బడ్జెట్‌ చిత్రం 'మాలిక్‌'ను కూడా ఓటీటీలోనే జులై 15న విడుదల చేశాడు ఫాజిల్‌. సినిమాలు విడుదల చేయడం చేయకపోవడం వాళ్ల సొంత లాభమే అనుకోవచ్చుగా అంటారా.? నిజమే కావచ్చు.. అయితే.. కరోనా సమయంలో ఉపాధిలేక అవస్థలు పడుతున్న సినిమా కార్మికులకు పని కల్పించిన విషయంలో మాత్రం ఫహద్‌ హీరోగానే మిగిలిపోయాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అప్పుడు ఛీ అన్నారు.. ఇప్పుడు శెభాష్‌ అంటున్నారు..

ఫహద్‌ సినిమాల్లో సెకండ్‌ ఇన్సింగ్‌ను అంత ఆషామాషీగా ఏం మొదలుపెట్టలేదు. పక్కా ప్రణాళికలతో రంగంలోకి దిగాడు. విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ అంతకంటే విభిన్నమై పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేశాడు. 'బెంగళూరు డేస్', 'అన్నాయుం రసులుం', 'మహేషింతే ప్రతికారం', 'తొండిమొదులం ద్రిక్షాక్షియుం', 'కుంబలంగి నైట్స్’', 'ట్రాన్స్‌' 'జోజి' ఈ చిత్రాలన్నీ అలా వచ్చినవే. ఈ సినిమా గురించి మలయాళ ప్రేక్షకులను అడిగితే 'ఒక్కోటి ఒక్కో ఆణిముత్యం' అనే బదులిస్తారు. 2016లో వచ్చిన 'మహేషింతే ప్రతీకారం' బ్లాక్‌బాస్టర్‌ అయింది. ఆ తర్వాత ‘కుంబలంగి నైట్స్’తో ఫహాద్‌ కెరీర్‌ టాప్‌ గేర్‌లో దూసుకెళ్లడం మొదలైంది. డబ్బింగ్‌ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ఫహద్‌ తొలిసారిగా ఓ తెలుగు చిత్రంలో నటించబోతున్నాడు. 'పుష్ప'లో విలన్‌గా మారి అల్లు అర్జున్‌ను ఢీకొట్టబోతున్నాడు. దీంతో పాటు కమల్‌ హాసన్‌, విజయ్‌సేతుపతితో కలిసి 'విక్రమ్‌'లోనూ నటించే ఛాన్స్‌ కొట్టేశాడు. ఫహద్‌ ప్రయాణం ఇలాగే విజయవంతంగా సాగుతూ ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచాలని కోరుకుందాం..

Ffahadh faasil news
పుష్పలో విలన్​గా

ఇవీ చదవండి:23 ఏళ్ల కెరీర్​లో అస్సలు సెలవు పెట్టని నటి ఈమె!

పాన్‌ ఇండియా చిత్రాలకు కాలం కలిసొస్తుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.