'పుష్పక విమానం'.. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఓ ప్రయోగం, ఓ సంచలనం, ఓ అద్భుతం. నటీనటులకు ఇదొక సాహసం. మాటల్లేకుండా కేవలం హావభావాలతోనే నడిచే కథ కావడం ఈ చిత్ర విశేషం.
కమల్ హాసన్, అమల జంటగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది. ఇందులో అమల అందం, అభినయం ప్రతి ఒక్కరిని ఫిదా చేశాయి. అయితే ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త బయటకొచ్చింది. అమల స్థానంలో మొదటగా బాలీవుడ్ ముద్దుగుమ్మ మాధురీ దీక్షిత్‌ను తీసుకోవాలని దర్శకుడు సింగీతం భావించారని తెలిసింది.
సినిమా చిత్రీకరణకు ముందు నాయిక అన్వేషణలో ఉన్న సింగీతానికి.. పరిచయమున్న వ్యక్తి కలిసి మాధురి ఉందని సలహా ఇచ్చారట. దాంతో మాధురి పీఏను సంప్రదించారు సింగీతం. అయితే మాటలు లేని సినిమాలో మాధురి నటించదని ఆమె పీఏ సమాధానం ఇచ్చాడు. దీంతో శ్రీనివాసరావు తన ఆలోచనను విరమించుకున్నారట. అలా మాధురికి ఈ సినిమా అవకాశం చేజారిపోయింది. ఆ తర్వాత ఓ కార్యక్రమంలో అమలని చూసిన సింగీతం ఆ పాత్రకు చక్కగా సరిపోతుందని భావించి ఈ చిత్రంలో ఎంపిక చేశారు.
ఇదీ చూడండి : ఆ అడవుల్లో బన్నీ 'పుష్ప' షూటింగ్!