ETV Bharat / sitara

Amitabh: అమితాబ్‌కు పేరు ఎవరు పెట్టారో తెలుసా?

అమితాబ్​ బచ్చన్(amitabh bachan name)​.. ఈ పేరు తెలియని వారుండరు. వెండితెరపై తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన.. బుల్లితెరపై కూడా చాలా కాలం నుంచి అద్భుతంగా రాణిస్తున్నారు. అయితే బిగ్​బీకి.. అమితాబ్​ అనే పేరు ఎవరు పెట్టారో తెలుసా?

amitab
అమితాబ్​
author img

By

Published : Sep 15, 2021, 7:24 AM IST

Updated : Sep 15, 2021, 11:54 AM IST

ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌కు(amitabh bachan name) పేరు ఎవరు పెట్టారు? 'తన తండ్రి' లేదా 'తన తల్లి' అంటూ సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారా! అలా అనుకుంటే మీరు పొరపడినట్లే. అమితాబ్‌ అని 'బిగ్‌ బీ'కి నామకరణం చేసింది తన తండ్రి కాదు, తన తల్లీ కాదు. ఇంకెవరంటారా... ఎవరో కాదు ప్రముఖ కవి, దివంగత సుమిత్రా నందన్‌ పంత్‌.

అమితాబ్ తండ్రి హరివంశరాయ్‌ బచ్చన్‌, సుమిత్రా నందన్‌ మంచి స్నేహితులు. ప్రత్యేక సందర్భాల్లో ఒకరింటికి ఒకరు వెళ్లి, ఆనందాన్ని పంచుకునేవారు. అలా అమితాబ్‌ నామకరణ వేడుకకు సుమిత్రా నందన్‌ విచ్చేశారు. ఆ సమయంలో శిశువు ముఖాన్ని తీక్షణంగా చూసిన సుమిత్రా నందన్‌ 'అమితాబ్‌' అనే పేరు ఖరారు చేశారు. ఆయన మాట ప్రకారమే హరివంశరాయ్‌ తన తనయుడ్ని అమితాబ్‌ చేశారు. స్వయంగా అమితాబ్‌ బచ్చనే ఈ విషయాన్ని పంచుకున్నారు. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న 'కౌన్‌ బనేగా క్రోర్‌పతి 13'(kbc crorepati amitabh bachchan) కార్యక్రమం వేదికగా తెలియజేశారు. తన తండ్రి కలం పేరే (బచ్చన్‌) ఇంటి పేరుగా మారిందని అమితాబ్‌ గతంలో వ్యక్తిగత బ్లాగ్‌లో రాశారు.

ఇదీ చూడండి: 'సినిమాల్లోకి రాకముందు బొగ్గు గనుల్లో పనిచేశా'

Last Updated : Sep 15, 2021, 11:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.